భారీగా పెరిగిన బంగారం ధరలు, త్వరలో ఆ మార్క్ దాటొచ్చు
బంగారం ధరలు ఈ రోజు (మే 8) తగ్గాయి. ఎంసీఎక్స్ జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.23 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.46,056 పలికింది. అంతకుముందు సెషన్‍లో ఉదయం తగ్గుముఖం పట్టినా సాయంత్రానికి రూ.800 పెరిగింది. ఎంసీఎక్స్‌లో వెండి ఫ్యూచర్స్ 0.24 శాతం పెరిగి కిలో రూ.43,228కి చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో కూడా 3 శాతం లేదా రూ.1,250 పెరిగింది. కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో బంగారం దుకాణాలు క్లోజ్ అయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గాయి. స్పాడ్ గోల్డ్ 0.2 శాతం తగ్గి ఔన్స్ ధర 1,714 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు సెషన్‌లో 2 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం 1 శాతం వరకు పెరిగాయి. కరోనా మహమ్మారి, అంతర్జాతీయంగా కరోనా వ్యాప్తి నిరోధించేందుకు ఆంక్షల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు.

బంగారం ర్యాలీ
ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.45,920 వద్ద మద్దతు ఉంటుందని, రూ.46,330 వద్ద ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రూ.46,330 కంటే పైకి ర్యాలీ అయితే ఆ తర్వాత రూ.46,600 వరకు వెళ్లవచ్చునని చెబుతున్నారు.

రూ.47,000 మార్క్ దాటుతుంది
కరోనా కారణంగా యూఎస్ సహా దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని, అందుకే ఇటీవలి కాలంలో రూ.44,500 నుండి రూ.47,000 మధ్య ట్రేడ్ అవుతోందని, మరికొద్ది రోజుల్లో రూ.47,000 మార్క్ దాటుతుందని అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో 1730 వద్ద
ఈ రోజు బంగారం పాజిటివ్‌గా ఉండవచ్చునని, ట్రేడర్స్ రూ.45,900 లెవల్స్ వరకు కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయస్థాయిలో బంగారం ఔన్స్ 1,730 డాలర్ల వద్ద ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని చెబుతున్నారు. కరోనా, ఆర్థిక వ్యవస్థలు కకాలావికళం కావడంతో బంగారం ధర గత కొద్ది రోజులుగా రూ.46,000 కాస్త అటు ఇటు మాత్రమే ఉంటోందని చెబుతున్నారు. త్వరలో రూ.47,000 మార్క్ దాటవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications