ముంబై: బంగారం ధరలు గత రెండు రోజుల్లో రూ.1,500 వరకు పెరిగాయి. అయితే నేటి ప్రారంభ సెషన్(బుధవారం, జనవరి 6) స్వల్పంగా తగ్గాయి. గత వారం రూ.50,000 స్థాయిలో ఉన్న పసిడి ధరలు ఈ రెండుసెషన్లలోనే రూ.51,000 దాటి, రూ.52,000 దిశగా కనిపించింది. అయితే నేడు కాస్త ఊరట కల్పించాయి. మొన్న ఒక్కరోజే రూ.1200 వరకు పెరిగిన పసిడి ధర, నిన్న రూ.300కు పైగా ఎగిసింది. గత ఏడాది ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టంతో పసిడి రూ.4800 తక్కువగా ఉంది.
నిన్న ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.311.00 (0.60%) పెరిగి రూ.51735.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.287.00 (0.56%) పెరిగి రూ.51791.00 వద్ద క్లోజ్ అయింది. వెండి మార్చి ఫ్యూచర్స్ రూ.844.00 (1.21%) పెరిగి రూ.70880.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.770.00 (1.08%) పెరిగి రూ.71789.00 వద్ద క్లోజ్ అయింది. పసిడి గత రెండు రోజుల్లో రూ.1500 పెరగగా, వెండి, రూ.2800 పెరిగింది.

స్థిరంగా బంగారం ధరలు
నేడు (బుధవారం, 6) ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 139.00 (0.27%) తగ్గి రూ.51581.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,555.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,644.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,490.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.4800 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.119.00 (-0.23%) తగ్గి రూ.51612.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,610.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,628.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,540.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 480.00 (-0.68%) క్షీణించి రూ.70378.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,323.00 వద్ద ప్రారంభమై, రూ.70,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,168.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.495.00 (-0.69%) తగ్గి రూ.71327.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,326.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,387.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం 1950 డాలర్లు క్రాస్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1950 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.30 (-0.32%) డాలర్లు తగ్గి 1,948.10 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,945.65 - 1,958.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.24% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.183 (-0.66%) డాలర్లు తగ్గి 27.457 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.350 - 27.808 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 50.44 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications