బంగారం ధరలు మళ్లీ క్షీణిస్తున్నాయి. అయితే ఈ క్షీణత స్వల్పంగా మాత్రమే ఉంది. ఇప్పటికీ పసిడి ధరలు రూ.46,000కు పైనే ఉన్నాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్ల మార్కుకు సమీపంలో ఉంది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9,500 తక్కువగా ఉంది. ఓ సమయంలో రూ.12,500 కూడా తక్కువ పలికింది. గత కొద్ది వారాల్లోనే పసిడి రూ.3000 పెరిగింది. బంగారం రెండ్రోజుల్లో రూ.1000 పెరిగింది.

అతి స్వల్పంగా తగ్గిన పసిడి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ఉదయం స్వల్పంగా తగ్గింది. రూ.22.00 (-0.05%) తగ్గి రూ.46816.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,766.00 ప్రారంభమైన ధర, రూ.46,887.00 గరిష్టాన్ని, రూ.46,675.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.36.00 (-0.08%) తగ్గి రూ.47033.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,998.00 ప్రారంభమైన ధర, రూ.47,140.00 గరిష్టాన్ని, రూ.46,926.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.500 డౌన్
వెండి ధరలు కూడా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.466.00 (-0.69%) పెరిగి రూ.67035.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,181.00 వద్ద ప్రారంభమై, రూ.67,456.00 గరిష్టాన్ని, రూ.66,958.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.-541.00 (-0.79%) తగ్గి రూ.67977.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,260.00 ప్రారంభమైన ధర, రూ.68,410.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,951.00 కనిష్టాన్ని తాకింది.

1750 డాలర్ల వద్ద బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నిన్నటి వరకు భారీగా పెరిగి, నేడు కాస్త తగ్గాయి. అయినప్పటికీ 1750 డాలర్ల వద్దే ఉంది. నేడు 9.75 (0.55%) డాలర్లు తగ్గి 1,748 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,747.95 - 1,758.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 25 డాలర్లకు పైనే ఉంది. 0.367 (1.43%) డాలర్లు తగ్గి 25.227 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.203 - 25.552 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications