రూ.48,000కు పైనే బంగారం ధరలు, వెండి రూ.73,000 స్థాయికి...
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. రిటైల్ మార్కెట్లో మాత్రం పరుగు పెడుతోంది. క్రితం సెషన్‌లో ఫ్యూచర్ మార్కెట్లో పసిడి పది గ్రాములు రూ.48,700 క్రాస్ చేసి మూడు నెలల గరిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు రూ.48,000 నుండి రూ.47,9000. మరింతగా క్షీణించి రూ.47,700 స్థాయికి పడిపోయే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇక వెండి మద్దతు ధర రూ.71,050 నుండి రూ.70,900.

ఫ్యూచర్‌లో తగ్గిన ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.287.00 (-0.59%) తగ్గి రూ.48387.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,598.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,619.00 గరిష్టాన్ని, రూ.48,269.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.334.00 (-0.68%) తగ్గి రూ.48865.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,091.00 వద్ద ప్రారంభమై, రూ.49,131.00 గరిష్టాన్ని, రూ.48,747.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప తగ్గుదల
వెండి ధరలు కూడా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.360.00 (-0.50%) తగ్గి రూ.72014.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,199.00 వద్ద ప్రారంభమై, రూ.72,471.00 గరిష్టాన్ని, రూ.71,532.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.391.00 (-0.53%) తగ్గి రూ.73088.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,315.00 ప్రారంభమైన ధర, రూ.73,478.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,686.00 కనిష్టాన్ని తాకింది.

స్వల్పంగా తగ్గిన పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగి, తాజాగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 1900 డాలర్ల దిశగా పసిడి ఇప్పుడు 1870 డాలర్ల స్థాయికి వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 11.15 (0.59%) డాలర్లు తగ్గి 1,870.35 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,864.25 - 1,879.45 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. 0.180 (0.64%) డాలర్లు తగ్గి 27.845 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.495 - 28.038 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications