నిన్న భారీగా పెరిగిన బంగారం ధర, నేడు తగ్గినా రూ.50,000కు పైనే: వెండి నిన్న రూ.2,200 జంప్

ముంబై: ఈవారం వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు నేటి (డిసెంబర్, శుక్రవారం 18) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. కరోనా వ్యాక్సీన్, వ్యాక్సినేషన్ ప్రకటనల నేపథ్యంలో పసిడి రూ.47,500కి పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ నిన్న రూ.50,000ను క్రాస్ చేసింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,900 మాత్రమే తక్కువగా ఉంది. పక్షం రోజుల క్రితం రూ.8,000కు పైగా తగ్గింది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ అంశాలు పసిడి, ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి.

నిన్న భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గిన బంగారం

నిన్న భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గిన బంగారం

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.98.00 (-0.19%) తగ్గి రూ.50292.00 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో రూ.50,319.00 వద్ద ప్రారంభమై, రూ.50,358.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,242.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.104.00 (-0.21%) క్షీణించి రూ.50350.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,294.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,410.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,294.00 కనిష్టాన్ని తాకింది.

నిన్న ఎంసీఎక్స్‌లో (గురువారం) బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.749.00 (1.51%) పెరిగి రూ.50,346.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.846.00 (1.71%) పెరిగి రూ.50449.00 వద్ద క్లోజ్ అయింది.

నిన్న రూ.2,285 పెరిగి, నేడు రూ.678 డౌన్

నిన్న రూ.2,285 పెరిగి, నేడు రూ.678 డౌన్

నిన్న రూ.68,000 క్రాస్ చేసిన సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఆ మార్క్ దిగువకు వచ్చింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.678.00 (-0.99%) క్షీణించి రూ.67589.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,961.00 వద్ద ప్రారంభమై, రూ.67,999.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,559.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే ఫ్యూచర్స్ కిలో రూ.706.00 (-1.02%) తగ్గి రూ.68453.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,681.00 ప్రారంభమైన ధర, రూ.68,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,453.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఇక, నిన్న సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.2,285.00 (3.47%) పెరిగి రూ.68196.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.2,310.00 (3.46%) పెరిగి రూ.69037.00 వద్దకు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను పసిడి ధర తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ 5.55(-0.29%) డాలర్లు క్షీణించి 1,884.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,883.75 - 1,891.30 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి 25.31% పెరిగింది. క్రితం సెషన్లో 1890 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.సిల్వర్ ఫ్యూచర్స్ 0.274 (-1.05%) డాలర్లు తగ్గి 25.907డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.933 - 26.270 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 26.181 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో సిల్వర్ 51.25% పెరిగింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+