బంగారం ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న (సోమవారం, జనవరి 4) భారీగా ఎగిసిన ధరలు నేడు దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న దాదాపు రూ.1200 పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చింది. వెండి రూ.2000 వరకు పెరిగింది. బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.4700 తక్కువగా ఉంది. పసిడి ధరలు గత ఏడాది ఆగస్ట్‌లో జీవనకాల గరిష్టాన్ని తాకి, ఆ తర్వాత పడిపోయాయి. ఏడాది చివరలో రూ.50,000 వద్ద ముగిసింది.

భారీ పెరుగుదల తర్వాత స్థిరంగా..
నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం అతి స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత అదే విధంగా తగ్గాయి. దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఉదయం గం.10 సమయానికి ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.26.00 (-0.05%) తగ్గి రూ.51398.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,397.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,478.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,374.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.4700 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.54.00 (-0.10%) తగ్గి రూ.51450.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,490.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.51,445.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.2500 జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా పెరిగింది. చాలా రోజుల తర్వాత రూ.70,000 క్రాస్ చేసింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 164.00 (0.23%) పెరిగి రూ.70200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,302.00 వద్ద ప్రారంభమై, రూ.70,488.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,101.00 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం రెండు రోజులుగా రూ.70వేలకు పైనే ఉంది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే పెరిగింది. రూ.121.00 (0.17%) పెరిగి రూ.71140.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,347.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,450.00 వద్ద గరిష్టాన్ని, రూ.71,080.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఇలా..
కొత్త ఏడాది 2021లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1900 డాలర్లు క్రాస్ చేసి, 1950 డాలర్ల దిశగా సాగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.35(-0.12%) డాలర్లు తగ్గి 1,944.40 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,938.45 - 1,949.15 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 22.94% శాతం పెరిగింది. నిన్న 40 డాలర్లకు పైగా పెరిగిన ధర నేడు స్వల్పంగా తగ్గింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. ఔన్స్ ధర 0.054 (+0.20%) డాలర్లు పెరిగి 27.418 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.152 - 27.602 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.86 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications