బంగారం, వెండి ధరలు నేడు (మే 25, మంగళవారం) ఉదయం కాస్త తగ్గినట్లే కనిపించినప్పటికీ మళ్లీ పెరిగాయి. బంగారం నేటి కనిష్టం నుండి రూ.400 వరకు పెరిగింది. ఇటీవల రూ.48,500 దిగువకు వచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ రూ.48,750 దాటి, రూ.49,000 దిశగా వెళ్తోంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.72,000 దాటింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7500 తక్కువగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.210.00 (0.43%) పెరిగి రూ.48763.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,425.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,820.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,333.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.169.00 (0.34%) పెరిగి రూ.49195.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,289.00 గరిష్టాన్ని, రూ.48,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.72,000 క్రాస్
వెండి ఫ్యూచర్ ధరలు సాయంత్రం పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.199.00 (0.28%) పెరిగి రూ.72020.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,510.00 వద్ద ప్రారంభమై, రూ.72,288.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,005.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.179.00 (0.25%) పెరిగి రూ.73100.00 వద్ద ట్రేడ్ అయింది. 72,608.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,330.00 గరిష్టాన్ని, రూ.72,175.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. మళ్లీ 1900 డాలర్ల దిశగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 8.15 (0.43%) డాలర్లు తగ్గి 1,892.65 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,873.30 - 1,896.65 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది.0.098 (0.35%) డాలర్లు పెరిగి 28.003 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.545 - 28.150 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications