బంగారం, వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో ధరలు క్షీణించాయి. నిన్న నాలుగు నెలల గరిష్టానికి చేరిన పసిడి ధరలు నేడు కాస్త శాంతించాయి. దేశీయంగా కరోనా కేసులు తగ్గడం, అంతర్జాతీయ సానుకూల పరిణామాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు జంప్ చేశాయి. సెన్సెక్స్ 50వేల పాయింట్లను దాటి 51వేల పాయింట్ల దిశగా, నిఫ్టీ 15వేల పాయింట్లకు పైన కదలాడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు పసిడి నుండి ఈక్విటీ వైపు దృష్టి సారించారు. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7800 తక్కువగా ఉంది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.61.00 (-0.13%) తగ్గి రూ.48492.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,425.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,590.00కు చేరుకొని, రూ.48,333.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.95.00 (-0.19%) తగ్గి రూ.48931.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,065.00 గరిష్టాన్ని, రూ.48,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.71,500 దిగువకు
వెండి ఫ్యూచర్ ధరలు నేడు తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.387.00 (-0.54%) తగ్గి రూ.71424.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,510.00 వద్ద ప్రారంభమై, రూ.71,750.00 కంటే పైకి చేరుకొని, రూ.71,005.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.421.00 (-0.58%) తగ్గి రూ.72500.00 వద్ద ట్రేడ్ అయింది. 72,608.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,820.00 గరిష్టాన్ని, రూ.72,175.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా తగ్గాయి. 1900 డాలర్లకు కాస్త దూరంలో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 0.55 (0.03%) డాలర్లు తగ్గి 1,883.95 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,873.30 - 1,887.75 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.147 (0.53%) డాలర్లు తగ్గి 27.755 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.545 - 27.918 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications