బంగారం ధరలు నిన్న (ఏప్రిల్ 20, మంగళవారం) రెండు నెలల గరిష్టాన్ని తాకాయి. బెంచ్ మార్క్ 10 ఇయర్ యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ గత వారం ఐదు వారాల కనిష్టానికి చేరుకున్న అనంతరం, ఈసారి 1.6 శాతం పెరిగాయి. అదే సమయంలో డాలర్ ఇండెక్స్ 0.2 శాతం క్షీణించి 90.88కి తగ్గింది. డాలర్ వ్యాల్యూ క్రమంగా పడిపోతుంది. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతోన్న విషయం తెలిసిందే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే ధరలు ఇప్పటికీ రూ.8400 తక్కువగా ఉంది. నిన్న ధరలు 430కి పైగా పెరిగాయి.

బంగారం ధరలు జంప్
గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.47వేలకు పైనే ఉన్నాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్నటి సెషన్‌లో రూ.436.00 (0.92%) పెరిగి రూ.47829.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,424.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,901.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,128.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.458.00 (0.96%) పెరిగి రూ.48130.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,590.00 ప్రారంభమైన ధర, రూ.48,165.00 గరిష్టాన్ని, రూ.47,442.00 కనిష్టాన్ని తాకింది.

68,000 దాటిన వెండి
వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.436.00 (0.64%) పెరిగి రూ.68760.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,476.00 వద్ద ప్రారంభమై, రూ.69,372.00 గరిష్టాన్ని, రూ.68,140.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.397.00 (0.57%) పెరిగి రూ.69841.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,701.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,420.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,236.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1775 డాలర్లు క్రాస్
ఇక, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మళ్లీ 1780 డాలర్ల దగ్గరలో ఉంది. 1.10 (0.06%) డాలర్లు తగ్గి 1,779.50 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,776.55 - 1,788.55 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.140 (0.54%) డాలర్లు తగ్గి 25.962 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.795 - 26.203 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పతనం.. ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్‌పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..



Click it and Unblock the Notifications