క్రితం సెషన్‌లో రూ.47,000 క్రాస్ చేసి భారీగా షాకిచ్చిన పసిడి ధరలు నేడు (ఏప్రిల్ 16, శుక్రవారం) స్వల్పంగా తగ్గాయి. వారాంతం ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47వేల దిగువకు వచ్చింది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గినప్పటికీ రూ.68,000కు పైనే కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్లో 1775 డాలర్ల దిశగా సాగిన పసిడి, నేడు దాదాపు స్థిరంగా ఉంది. వెండి అతి స్వల్పంగా పెరిగి 26 డాలర్లకు చేరువలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి నిరోధక 1764 డాలర్లు. ఢిల్లీలో 24 గ్రాములు పసిడి ధరలు రూ.48,255గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదల
నిన్న రూ.47వేల పైకి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఆ స్థాయి కంటే దిగువకు వచ్చాయి. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్‌లో రూ.277.00 (0.59%) తగ్గి రూ.46898.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,099.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,148.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,820.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్ రూ.251.00 (-0.53%) తగ్గి రూ.47150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,370.00 ప్రారంభమైన ధర, రూ.47,387.00 గరిష్టాన్ని, రూ.47,053.00 కనిష్టాన్ని తాకింది.

రూ.380 తగ్గిన వెండి
వెండి ధరలు క్షీణించాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.380.00 (-0.55%) తగ్గి రూ.68160.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,400.00 వద్ద ప్రారంభమై, రూ.68,459.00 గరిష్టాన్ని, రూ.67,990.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.372.00 (-0.53%) తగ్గి రూ.69240.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,489.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,509.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,087.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1766 డాలర్ల వద్ద బంగారం
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న 1770 డాలర్లను దాటి ఆ తర్వాత 1766 డాలర్ల వద్ద ముగిసింది. నేడు -0.30
(-0.02%) డాలర్లు క్షీణించి 1,766.50 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,760.45 - 1,766.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. +0.013 (+0.05%) డాలర్లు తగ్గి 25.977 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.797 - 25.973 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications