బంగారం ధరలు మరింత పతనం, కొనుగోలుదారులకు భారీ ఊరట: వెండి జంప్
ముంబై: బంగారం ధరలు నేడు మరింతగా తగ్గాయి. నిన్ననే రూ.45వేల దిగువకు చేరుకున్న ధరలు, నేడు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పసిడి ఫ్యూచర్ రూ.11,500 వరకు తక్కువగా ఉంది. బంగారం ధరలు నిన్న ఏకంగా రూ.577 తగ్గి రూ.45,000 దిగువన ముగిసింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ మొదటిసారి రూ.44,970 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.620 క్షీణించి రూ.45,129 వద్ద ముగిసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.1413 తగ్గి రూ.65,926 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1145 తగ్గి రూ.68,070 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్లో బంగారం 1715 డాలర్ల వద్ద, వెండి 26.180 డాలర్ల వద్ద ముగిసింది.

రూ.44,850 వద్ద పసిడి
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (గురువారం, మార్చి 4) ఉదయం సెషన్లో రూ.45,000 దిగువనే ట్రేడ్ అయింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.98.00 (-0.22%) తగ్గి రూ.44,850.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,735.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,874.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,712.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.80.00 (-0.18%) తగ్గి రూ.45,032 వద్ద ట్రేడ్ అయింది. 44,965.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,032.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,899.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి మాత్రం పెరిగింది
నిన్న తగ్గిన వెండి ధరలు నేడు మాత్రం పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.199.00 (0.30%) పెరిగి రూ.66,312.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,437.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,437.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,970.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. కిలో రూ.501.00 (0.74%) తగ్గి రూ.67499.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,526.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,628.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,005.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

బంగారం మరింత పతనం
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు తగ్గాయి. 1715 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.10 (0.18%) డాలర్లు తగ్గి 1712.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,704.55 - 1,714.70 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 27 డాలర్ల దిగువనే ఉంది. ఔన్స్ ధర 0.162 (0.61%) డాలర్లు తగ్గి 26.225 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.970 - 26.363 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications