బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ సెషన్‌లో అతి స్వల్పంగా పెరిగాయి. ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు. పలువురు యూఎస్ సెంట్రల్ బ్యాంకు అధికారులు బాండింగ్ కొనుగోళ్లకు పిలుపునిచ్చారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్‌కు 0.1 శాతం లాభపడి 1,793.68 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 0.1 శాతం లాభపడి 1796.70 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయితే నేడు మరింత ఎగబాకి 1800 డాలర్లను క్రాస్ చేసింది. గురువారం ఫెడరల్ రిజర్వ్ హాకింగ్ విధాన రూపకర్తలు సెంట్రల్ బ్యాంకుకు బాండ్ కొనుగోళ్లపై సూచన చేశారు. కరోనా డెల్టా వేరియంట్ కేసుల ప్రభావం పసిడి పైన కనిపిస్తోంది. దీనికి తోడు జెరోమ్ పోవెల్ ప్రసంగం కోసం ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారు.

ఫ్యూచర్ మార్కెట్లో ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర నేడు ప్రారంభ సెషన్‌లో రూ.161.00 (0.34%) లాభపడి రూ.47398.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.159.00 (0.34%) ఎగిసి రూ.47566.00 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.47,450ను తాకింది. ఇటీవల రూ.63,000 దిగువనే ఉన్న సిల్వర్ ఫ్యూచర్స్ రెండు రోజులుగా లాభపడింది. దీంతో ఈ మార్కు దాటింది. నిన్న మళ్లీ ఈ మార్క్ దిగువకు పడిపోయింది. నేడు ఉదయం సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.217 ఎగబాకినప్పటికీ రూ.62,940 వద్ద ట్రేడ్ అయి, ఆ మార్కు దిగువనే ఉంది. అలాగే రూ.48,000 దిశగా సాగిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే తిరిగి స్వల్పంగా లాభపడుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో 6.55 (0.36%) డాలర్లు వృద్ధి సాధించి 1801.75 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.078 (0.33%) డాలర్లు లాభపడి 23.622 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మద్దతు ధర
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు 1,784 డాలర్ల నుండి 1,768 డాలర్లు. నిరోధకస్థాయి 1,808 డాలర్ల నుండి 1,822. వెండి ఫ్యూచర్స్ మద్దతు ధర 23.20 డాలర్ల నుండి 22.88 డాలర్లు. నిరోధకస్థాయి 23.88 డాలర్ల నుండి 24.20 డాలర్లు.
ఇక ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,050 డాలర్ల నుండి రూ.46,880. నిరోధకస్థాయి రూ.47,380 డాలర్ల నుండి రూ.47,600. వెండి రూ.62,300 డాలర్ల నుండి రూ.61,900. నిరోధకస్థాయి రూ.63,100 డాలర్ల నుండి రూ.63,500.

ధరలపై వీటి ప్రభావం
హాంగ్‌కాంగ్ సెన్సస్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్టుమెంట్ డేటా ప్రకారం హాంగ్ కాంగ్ ద్వారా జరిగే చైనా నికర బంగారం దిగుమతులు జూలై నెలలో 29 శాతం క్షీణించాయి. జూన్ నెలలో మాత్రం దిగుమతులు పెరిగాయి. ఆప్ఘనిస్తాన్ పరిస్థితులు ఎగుమతులు, దిగుమతుల పైన ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ రికవరీ, హాకిష్ ఫెడ్ కామెంట్స్, బలహీనమైన ఇన్వెస్టర్ ఇంటరెస్ట్, చైనా గోల్డ్ దిగుమతులు పడిపోవడం వంటి అంశాలు బంగారం ధరల పైన ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!



Click it and Unblock the Notifications