గత కొద్దిరోజులుగా భారీగా తగ్గుతున్న పసిడి ధరలు ఈరోజు (గురువారం, నవంబర్, 26) స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ పసిడి ధరలు రూ.49,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ నాటి ఆల్ టైమ్ గరిష్టం గోల్డ్ ఫ్యూచర్స్ రూ.56,200తో ఇప్పటికీ రూ.7,500 నుండి రూ.8,000 మేరకు తక్కువగా ఉంది. ఇక, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గాయి. దీంతో ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేలతో రూ.20వేల వరకు తక్కువగా ఉంది. వ్యాక్సీన్ పైన ప్రకటనల నేపథ్యంలో పసిడి ధరలు క్షీణిస్తున్నాయి.

గరిష్టంతో దాదాపు రూ.8,000 వరకు తక్కువ
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.55.00 (0.11%) పెరిగి రూ.48,568.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,524.00 వద్ద ప్రారంభమై, రూ.48,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,524.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7,700 వరకు తక్కువగా ఉంది. అంటే దాదాపు రూ.8,000 తక్కువ ఉంది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.61.00 (0.13%) క్షీణించి రూ.48,557.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,564.00 వద్ద ప్రారంభమై, రూ.48,771.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,483.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర తగ్గుదల
డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.93.00 (-0.16%) తగ్గి రూ.59,750.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.60,034.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.60,267.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,450.00 వద్ద కనిష్టాన్ని తాకింది. రెండు రోజులుగా వెండి రూ.60వేలకు దిగువన పలుకుతోంది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.140.00 (-0.23%) తగ్గి రూ.61508.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,860.00 ప్రారంభమైన ధర, రూ.61,998.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,290.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పెరిగిన బంగారం, తగ్గిన వెండి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ +2.45 (+0.14%) డాలర్లు పెరిగి 1,807.85 వద్ద ట్రేడ్ అయింది. 1,804.20 - 1,816.80 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో బంగారం 21.3% మేర పెరిగింది. క్రితం సెషన్లో 1,805.50 డాలర్ల వద్ద ముగిసింది.
వెండి ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. ఔన్స్ వెండి -0.050 (-0.21%) డాలర్లు తగ్గి 23.312 వద్ద ట్రేడ్ అయింది. 23.190 - 23.505 మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 35 శాతం మేర పెరిగింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications