రూ.49,000 దాటిన బంగారం ధర, ఈ దూకుడుతో త్వరలో రూ.50,000కు!!
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు రూ.49,000 దిశగా పరుగులు పెడుతున్నాయి. ఓ సమయంలో రూ.49,000 దాటింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 1 శాతం ఎగిసి రూ.72,000 క్రాస్ చేసి రూ.73వేల దిశగా సాగుతోంది. ఓ వైపు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తూ సరికొత్త గరిష్టాలకు చేరుకుంటుండగా, మరోవైపు పసిడి, వెండి కూడా అదే దారిలో పయనిస్తుండటం గమనార్హం. ఇదే దూకుడుతో వెళ్తే త్వరలో రూ.50వేలు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.

పసిడి జంప్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.159.00 (0.33%) పెరిగి రూ.48980.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,049.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,082.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,917.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.144.00 (0.29%) పెరిగి రూ.49493.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,461.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,495.00 గరిష్టాన్ని, రూ.49,433.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72వేలు దాటిన వెండి
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.705.00 (0.98%) పెరిగి రూ.72603.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,500.00 వద్ద ప్రారంభమై, రూ.72,668.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.72,460.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.626.00 (0.86%) పెరిగి రూ.73727.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,786.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,800.00 గరిష్టాన్ని, రూ.73,610.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు పెరిగాయి. 1915 డాలర్ల సమీపానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 7.75 (+0.41%) డాలర్లు పెరిగి 1,913.05 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,908.80 - 1,916.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.303 (+1.08%) డాలర్లు పెరిగి 28.317 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.122 - 28.462డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications