ముంబై: పసిడి ధరలు శుక్రవారం (అక్టోబర్16) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఉదయం ప్రారంభంలో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.50,635కు తగ్గింది. వెండి కిలో ప్యూచర్స్ రూ.61,650కి పెరిగింది. పసిడి ధరలు గతవారం పదిరోజులుగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. ఇంంతకుముందు సెషన్‌లో పసిడి 0.3 శాతం పెరిగాయి. వెండి ధరలు 0.3 శాతం క్షీణించింది. ఆగస్ట్ మాసంలో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికిన విషయం తెలిసిందే. ఆ ధరతో ఇప్పటికీ రూ.5,500కు పైగా తక్కువ ఉంది.

తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర
గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ తగ్గగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర స్వల్పంగా పెరిగింది. 0.03 శాతం పెరిగి 10 గ్రాములు రూ.50,775 పలికింది. రూ.50,811 వద్ద ప్రారంభమైంది. నేటి గరిష్టం కూడా అదే. కనిష్టం రూ.50,770 పలికింది.
వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 0.19 శాతం(రూ.115) పెరిగి రూ.61,650 పలికింది. నేడు రూ.61,649 వద్ద ప్రారంభించింది. రూ.61,781 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.61,469 వద్ద కనిష్టాన్ని తాకింది.
వెండి మార్చి ఫ్యూచర్స్ 0.21 శాతం (రూ.135) పెరిగి కిలో రూ.63,382 పలికింది. రూ.63,377 వద్ద ప్రారంభమై, రూ.63,462 వద్ద గరిష్టాన్ని, రూ.63,310 వ్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అప్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 0.05 శాతం పెరిగి ఔన్స్ ధర 1,909.85 డాలర్లు పలికింది. 1,907.95 - 1,915.15 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1,908.90 డాలర్ల వద్ద ముగిసింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ 0.79 శాతం ఎగిసి ఔన్స్ 24.415 డాలర్లు పలికింది. వెండి 24.315 - 24.545 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.224 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆగస్ట్‌లో ఆల్ టైమ్ గరిష్టం 2,075 డాలర్లు పలకగా, వెండి 30 డాలర్ల మార్క్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

బులియన్ మార్కెట్లో...
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,740 పలికింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.48,310 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.53,730, 22 క్యారెట్ల పసిడి రూ.49,250 పలికింది.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై లేటెస్ట్ రిపోర్ట్.. సరికొత్త నివేదికను విడుదల చేసిన ప్రముఖ బ్యాంకులు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు ర్యాలీ చేసిందంటే.. ఏప్రిల్ 11, శనివారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!



Click it and Unblock the Notifications