బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? ఆ తర్వాత ఊగిసలాటలో...
ముంబై: బంగారం ధరలు నేడు (శుక్రవారం, మార్చి 17) దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిన్న ఫ్యూచర్ మార్కెట్లో ఒక్కసారి మాత్రమే రూ.45వేల మార్కు దాటిన గోల్డ్ ఫ్యూచర్ ఆ తర్వాత క్షీణించింది. గత కొద్ది రోజులుగా 45వేల మార్కు దిగువనే ఉంటోంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ ప్రకటన అనంతరం బంగారం, వెండి అంతర్జాతీయ మార్కెట్లో ఊగిసలాటలో ఉంది. అందుకే ఇటీవలి వరకు 1700 డాలర్ల దిగువనే ఉన్న పసిడి నిన్న ఏకంగా 1750 డాలర్ల పైకి చేరుకుంది. ఆ తర్వాత 1730 డాలర్ల స్థాయికి వచ్చింది. అమెరికా టెన్ ఇయర్ బాండ్ యీల్డ్స్ 14 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. ఇవి పెరగడం ద్వారా రిస్కియర్ అసెట్స్‌లో ర్యాలీని పరిమితం చేస్తుంది.

బంగారం ధరలు స్థిరంగా
గోల్డ్ ఫ్యూచర్ ధరలు శుక్రవారం ప్రారంభ సెషన్లో స్వల్పంగా క్షీణించింది. నిన్న ఓ సమయంలో రూ.45వేల మార్కును క్రాస్ చేసిన ఫ్యూచర్ గోల్డ్ అంతలోనే కిందకు పడిపోయింది. నేడు దాదాపు స్థిరంగా ఉంది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.64.00 (-0.14%) క్షీణించి రూ.44887.00 వద్ద ట్రేడ్ అయింది.
రూ.44,928.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,961.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,830.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,300 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.96.00 (-0.21%) తగ్గి రూ.45213.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,300.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,191.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.600 డౌన్
వెండి ధరలు తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.597.00 (-0.88%) తగ్గి రూ.67150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,137.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,234.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,050.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా తగ్గింది. కిలో రూ.487.00 (-0.71%) తగ్గి రూ.68256.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,256 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,256 వద్ద గరిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న ప్రారంభంలో 1750 డాలర్లు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత 1730 స్థాయికి క్షీణించింది. నేడు అక్కడే కదలాడుతోంది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.20 (0.13%) డాలర్లు క్షీణించి 1,730.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,727.10 - 1,735.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైనే కదలాడుతోంది. ఔన్స్ ధర 0.266 (-1.01%) డాలర్లు క్షీణించి 26.087 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.933 - 26.175 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications