నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు (మార్చి 15, 2022) కాస్త ఎక్కువగానే తగ్గుముఖం పట్టాయి. ఉదయం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,000 దిగువకు పడిపోయాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో ధరలు రూ.55,000ను తాకాయి. అయితే యుద్ధం దాదాపు ముగిసి, చర్చల ప్రక్రియ కొనసాగుతుండటంతో పసిడి మార్కెట్ కాస్త ఢీలాపడింది. దీంతో ఈ కొద్ది రోజుల్లోనే వేలల్లో తగ్గింది.

క్రితం సెషన్‌లో స్థిరంగా
బంగారం ధరలు క్రితం సెషన్‌లో దాదాపు స్థిరంగా ముగిశాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా రూ.8 క్షీణించి రూ.52,296 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.30 తగ్గి రూ.52,867 వద్ద ముగియగా, మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.53 తగ్గి రూ.68,897 వద్ద ముగిసింది.
గతవారం రూ.70,000 పైన ముగిసిన సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం ఈ మార్కు దిగువకు వచ్చింది. అలాగే బంగారం ధరలు రూ.52,000 స్థాయికి వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం చల్లబడిన తర్వాత బంగారం ఈ నాలుగైదు సెషన్‌లలోనే రూ.3500 తగ్గింది.

నేడు రూ.400 డౌన్
నేడు ప్రారంభ సెషన్‌లో పసిడి ధరలు రూ.400 వరకు తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.380 తగ్గి రూ.51,924 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.368 క్షీణించి రూ.52,529 వద్ద ట్రేడ్ అయింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.622 క్షీణించి రూ.68,222 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.626 తగ్గి రూ.69,050 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,000 దిగువకు, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.70,000 దిగువకు వచ్చింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్‌లో గతవారం పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం (2075 )సమీపానికి చేరుకున్నాయి. 2050 డాలర్లను సమీపించింది. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తగ్గిన నేపథ్యంలో ఈ కాలంలో 100 డాలర్లకు పైగా క్షీణించాయి. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 1943 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications