దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించగా, వెండి ధరలు పెరిగాయి. గతవారంలో మొత్తంగా పసిడి ధరల్లో స్వల్ప క్షీణత కనిపించింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ గత సోమవారం ఉదయం రూ.50,940 వద్ద ప్రారంభమైంది. వారంతంలో రూ.50,552 వద్ద క్లోజ్ అయింది. మొత్తంగా రూ.400 వరకు తగ్గింది. ఓ సమయంలో రూ.51వేల మార్క్ దాటింది. శుక్రవారం రూ.160 క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,600 వరకు తక్కువ ఉంది.

రూ.51వేల దిగువకు బంగారం
ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,140 వద్ద ప్రారంభమైంది. వారాంతంలో రూ.50,615 వద్ద ముగిసింది. ఈ ధర కూడా రూ.500 వరకు క్షీణించింది. శుక్రవారం ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.146 క్షీణించింది. క్రితం వారం రూ.51వేలకు పైన ప్రారంభమైన ధర వారం ముగిసేసరికి రూ.51వేల దిగువకు వచ్చింది.

రూ.వెయ్యికి పైగా తగ్గిన వెండి ధర
వెండి ధరలు వారంతంలో పెరిగినప్పటికీ, వారం మొత్తంగా చూసుకుంటే క్షీణించాయి. గత సోమవారం డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.62,900కు కాస్త అటుఇటుగా ప్రారంభమైన ధరలు వారం ముగిసేసరికి రూ.61,653 వద్ద ముగిశాయి. శుక్రవారం రూ.118 పెరిగింది. మొత్తంగా వారంలో రూ.1200కు పైగా తగ్గింది. మార్చి ఫ్యూచర్స్ రూ.64,700కు కాస్త అటు ఇటుగా ప్రారంభమై వారం చివరలో రూ.రూ.63,193 వద్ద క్లోజ్ అయింది.

స్వల్పంగా పెరుగుదల
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స గత సోమవారం 1893 డాలర్ల వద్ద ప్రారంభమై 1924 డీలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 1940 డాలర్లను కూడా తాకింది. అయితే వారాంతంలో 1902 డాలర్ల వద్ద ముగిసింది. మొత్తంగా ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ఫ్యూచర్స్ దాదాపు ప్రారంభమైన వద్దనే ముగిసింది. ఔన్స్ పసిడి క్రితం వారం 24.285 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

బులియన్ మార్కెట్లో ధరలు..
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,940 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.48,870 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.53,760, 22 క్యారెట్ల పసిడి రూ.49,280 పలికింది. కిలో వెండి రూ.61,600కు దిగి వచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం.


Click it and Unblock the Notifications