ముంబై: బంగారం ధరలు నేడు (జనవరి 21, గురువారం) స్వల్పంగా పెరగగా, వెండి పెరిగింది. ప్రారంభంలో స్వల్ప లాభాల్లో కనిపించినప్పటికీ, ఆ తర్వాత తగ్గాయి. ఉదయం సెషన్‌లో 0.3 శాతం ఎగబాకి వరుసగా నాలుగో రోజు కూడా పెరిగి రూ.50,000 వెళ్లే దిశగా కనిపించింది. అయితే అంతలోనే పడిపోయింది. గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ నిన్న ఎంసీఎక్స్‌లో రూ.586 పెరిగి రూ.49,569.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.629.00 పెరిగి రూ.49,681.00 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,054.00 పెరిగి రూ.67,090.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.1,151.00 ఎగిసి రూ.67930.00 వద్ద క్లోజ్ అయింది. అయితే నేడు బంగారం ధర అతి స్వల్పంగా క్షీణించింది.

రూ.50వేలకు దిగువనే
నేడు సాయంత్రం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 117.00 (0.24%) క్షీణించి రూ.49,417.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,699.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,765.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,323.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6800 వరకు ఉంది. బంగారం ధరలు కొద్ది రోజులుగా రూ.50వేల సమీపంలోనే కదలాడుతున్నాయి.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 41.00 (0.08%) తగ్గి రూ.49,600.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,749.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,869.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,498.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్పంగా జంప్
బంగారం ధరలు తగ్గగా, వెండి ఫ్యూచర్స్ పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 320.00 (0.48%) పెరిగి రూ.67310.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,848.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,956.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.301.00 (0.44%) పెరిగి రూ.68141.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,377.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,736.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,927.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1870 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగి 1870 డాలర్ల దిగువకు చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -3.35 (-0.18%) డాలర్లు తగ్గి 1,863.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,857.75 - 1,874.65 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.88% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ ధర 0.016 (+0.06%) డాలర్లు పెరిగి 25.782 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.703 - 26.128 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 43.62శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్‌పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..

బంగారం ధర రూ.1.70 లక్షలు.. వెండి ధర రూ.3 లక్షలకు పెరుగుతుందా? పసిడి ర్యాలీపై ఆర్థిక నిపుణలు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..



Click it and Unblock the Notifications