భారీగా తగ్గిన బంగారం ధర! ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఏకంగా రూ.46,000 దిగువకు
ముంబై: బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.10,200 కంటే పైన తక్కువ ఉంది. కొనుగోలుదారులకు ఇది శుభవార్తే. ఈ రోజు పసిడి ఏకంగా రూ.46,000 దిగువకు పడిపోయింది. వరుసగా ఆరు రోజుల పాటు క్షీణించడంతో బంగారం ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయింది. చాలా రోజుల తర్వాత పసిడి రూ.46,000 దిగువకు వచ్చింది. కేవలం ఈ ఏడాది (2021) బంగారం రూ.4వేలు (8 శాతం) పడిపోయింది. వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా తగ్గి రూ.67,600 దిగువకు వచ్చాయి.

రూ.46,000 దిగువకు బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. అయితే రూ.46,000 దిగువకు వచ్చింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.170.00 (-0.37%) తగ్గి రూ.45,956.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,986.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,079.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,924.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,200 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.202.00 (-0.44%) తగ్గి రూ.46,093 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,203.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,203.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,070.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

68,000 దిగువకు వెండి
వెండి ధరలు ఈ రోజు రూ.వెయ్యి వరకు తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.202.00 (-0.44%) తగ్గి రూ.67,594.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,560.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.856.00 (1.23%) క్షీణించి రూ.68,775.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,932.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,734.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,734.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1770 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నేడు 1770 డాలర్లకు దిగువకు వచ్చింది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -10.85
(-0.61%) డాలర్లు తగ్గి 1764.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,759.15 - 1,776.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 8.04 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర -0.353
(-1.30%) డాలర్లు తగ్గి 27.725 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.180 - 27.100 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 44.79 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications