ముంబై: బంగారం ధరలు సోమవారం (నవంబర్ 23) స్వల్పంగా పెరిగాయి. గత రెండు వారాల్లో దాదాపు రూ.2వేలు క్షీణించిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.75 పెరిగింది. ఉదయం గం.10.45 సమయానికి 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ 0.15 శాతం పెరిగి రూ.50,287 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,234.00 ప్రారంభమైన ధర, రూ.50,287.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,211.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ఫ్యూచర్స్ రూ.56,200 పలికింది. ఈ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6000 వరకు తక్కువగా ఉంది.

వరుసగా తగ్గి.. నేడు స్వల్ప పెరుగుదల
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.75 క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.65.00 (0.13%) తగ్గి రూ.50,291 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,231.00 ప్రారంభమైన ధర, రూ.50,305.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,231.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతకుముందు వారం రూ.1200 తగ్గిన గోల్డ్ ఫ్యూచర్స్, గతవారం రూ.700 క్షీణించింది. మొత్తంగా దాదాపు రూ.2వేలు తగ్గింది. ఈ వారం స్వల్పంగా పెరుగుదలతో ప్రారంభమయ్యాయి.

బంగారం పైకి.. వెండి కిందకు
వెండి ధర మాత్రం తగ్గింది. కిలో వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.-38.00 (-0.06%) క్షీణించి రూ.62,120 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,119.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,190.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,055.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.79వేల ధరతో వెండి రూ.18వేల వరకు తక్కువ పలుకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో రెండూ డౌన్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి రెండింటి ధరలు క్షీణించాయి. ఔన్స్ పసిడి +0.15 (+0.01%) డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 1,867.45 - 1,875.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,872.40 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో పసిడి 25 డాలర్లకు పైగా పెరిగింది.
ఇక, వెండి ఫ్యూచర్స్ -0.040 (-0.16%) డాలర్లు తగ్గి 24.323 వద్ద ట్రేడ్ అయింది. నేడు 24.148 - 24.455 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.363 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 41 శాతం పెరిగింది.
More From GoodReturns

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications