భారీగా తగ్గిన బంగారం ధర, మళ్లీ డౌన్‌ఫాల్ ఎందుకంటే? అక్కడ మాత్రం జంప్
గత కొద్ది రోజులుగా బంగారం ధర తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతకుముందు మూడువారాలు భారీగా క్షీణించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో పది గ్రాములు రూ.48,000 దిగువకు పడిపోయింది. అయితే గత వారం ప్రారంభం నుండి మొన్నటి వరకు ఎగిసింది. తాజాగా కరోనా కేసులు తగ్గడం, ఫైజర్ వ్యాక్సీన్‌కు అమెరికా అనుమతి, రికవరీలు పెరగడం, ఈక్విటీ మార్కెట్ జోరు వంటి వివిధ కారణలతో పసిడిపై ఒత్తిడి తగ్గింది.
దీంతో 2 రోజుల్లో పసిడి ధరలు రూ.1,000 వరకు తగ్గింది. ఎంసీఎక్స్‌లో నిన్న ఫిబ్రవరి ఫ్యూచర్స్ గోల్డ్ నిన్న రాత్రి రూ.919.00(1.83%) క్షీణించి రూ.49,190 వద్ద ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.851.00 (1.70%) క్షీణించి రూ.49,278 వద్ద క్లోజ్ అయింది. ఇక వెండి రూ.63,500 దిగువకు వచ్చింది. నిన్న రూ.1500కు పైగ్ క్షీణించింది.

బంగారం రూ.1000 వరకు డౌన్
నిన్న రూ.900కు పైగా తగ్గిన పసిడి నేడు (డిసెంబర్ 10, గురువారం) ప్రారంభ సెషన్‌లో రూ.40 వరకు తగ్గింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం రూ.37.00 (-0.08%) క్షీణించి రూ.49223.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,165.00 వద్ద ప్రారంభమై, రూ.49,283.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,165.00 వద్ద కనిష్టాన్ని తాకింది. రెండు రోజుల్లో రూ.1000 వరకు తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7000 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.7.00 (0.01%) పెరిగి రూ.49350.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,350.00 ప్రారంభమై, రూ.49,385.00 గరిష్టాన్ని, 49,320.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప పెరుగుదల
వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి కిలో రూ.201.00 (0.32%) పెరిగి రూ.63700.00 వద్ద ట్రేడ్ అయింది. 63,747.00 వద్ద ప్రారంభమై, రూ.63,747.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.211.00 (-0.33%) తగ్గి రూ.64191.00 వద్ద ఉంది.

అక్కడ పసిడి, సిల్వర్ జంప్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేడు పెరిగాయి. ఔన్స్ 6.55 (+0.36%) డాలర్లు పెరిగి 1,845.10 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,837.35 - 1,845.85 డాలర్ల మధ్య కదలాడింది. అంతక్రితం సెషన్లో 1,838.50 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. 1850 డాలర్లకు సమీపంలో ఉంది. ఏడాదిలో 23.27%
పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ 0.162 (+0.68%) పెరిగి ఔన్స్ 24.152 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.948 - 24.165 మధ్య కదలాడింది. ఏడాదిలో 42.38 శాతం ఎగిసిన సిల్వర్, క్రితం సెషన్లో 23.90 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications