Gold prices today : స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు జంప్
ముంబై: నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, నేడు (మంగళవారం, జనవరి 19) అతి స్వల్పంగా తగ్గాయి. నేడు ప్రారంభ సెషన్‌లో పసిడి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.34 తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ నిన్న రూ.175.00 (0.36%) పెరిగి రూ.48,877.00 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.231.00 (0.47%) పెరిగి రూ.48,946.00 వద్ద ముగిసింది. సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ రూ.621.00 (0.96%) పెరిగి రూ.65,385.00 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.643.00 (0.98%) పెరిగి రూ.66,259.00 వద్ద క్లోజ్ అయింది.

49,000 సమీపంలో పసిడి
నేడు ప్రారంభ సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 24.00 (-0.05%) తగ్గి రూ.48,870.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,965.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,965.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,813.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7400 వరకు తక్కువగా ఉంది.
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 25.00 (-0.05%) తగ్గి రూ.48,927.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,921.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,927.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,886.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి మాత్రం జంప్
బంగారం ధరలు తగ్గగా, సిల్వర్ గోల్డ్ ఫ్యూచర్స్ పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 311.00 (0.48%) పెరిగి రూ.65740.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,829.00 వద్ద ప్రారంభమై, రూ.65,871.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,654.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.318.00 (0.48%) పెరిగి రూ.66575.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,675.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,675.00 వద్ద గరిష్టాన్ని, రూ.65575.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్లకు దిగువనే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగినప్పటికీ 1850 డాలర్లకు దిగువనే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ +7.05 (+0.39%) డాలర్లు పెరిగి 1,836.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,835.35 - 1,843.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 18.35% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.387 (+1.56%) డాలర్లు తగ్గి 25.253 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.992 - 25.365 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.31శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications