అక్కడ భారీగా పెరిగి, అంతలోనే పతనమైన బంగారం ధర
ముంబై: బంగారం ధరలు గత కొద్దివారాలుగా స్థిరంగా ఉంటున్నాయి. ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ రూ.45,000 దిగువనే కదలాడుతోంది. హైదరాబాద్ రిటైల్ బులియన్ మార్కెట్లో బంగారం రూ.45,830 పలికింది. కేరళ, విశాఖపట్నం, బెంగళూరులలోను దాదాపు అంతే ఉంది. 22 క్యారెట్ల పసిడి రూ.42,010 వద్ద ట్రేడ్ అయింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.70వేలకు పైన ఉంది. బెంగళూరులో రూ.68 వేల దిగువనే ఉంది. ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.11,300 తక్కువగా ఉంది.

రూ.45వేలు దాటి మళ్లీ పడిపోయిన పసిడి
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు సాయంత్రం సెషన్లో స్వల్పంగా పెరిగింది. ఓ సమయంలో రూ.45వేల మార్కును క్రాస్ చేసిన ఫ్యూచర్ గోల్డ్ అంతలోనే కిందకు పడిపోయింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.95.00 (0.21%) పెరిగి రూ.44935.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,892.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,299.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,626.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,300 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. రూ.101.00 (0.22%) పెరిగి రూ.45307.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,561.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,761.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.600 జంప్
వెండి ధరలు పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.607.00 (0.90%) తగ్గి రూ.67834.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,260.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,470.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,887.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో రూ.593.00 (0.87%) పెరిగి రూ.68851.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,060 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,461 వద్ద గరిష్టాన్ని, రూ.68,000 వద్ద కనిష్టాన్ని తాకింది.

ప్రారంభంలో భారీగా పెరిగి, మళ్లీ తగ్గుదల
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు ప్రారంభంలో భారీగా పెరిగినప్పటికీ, ఆ తర్వాత స్వల్ప లాభాల్లోకి వెళ్లాయి. ప్రారంభంలో 1750 డాలర్లు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత 1730 స్థాయికి క్షీణించింది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 2.95 (0.17%) డాలర్లు పెరిగి 1,730.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,716.90 - 1,754.10 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైన ఉంది. ఔన్స్ ధర 0.184
(+0.71%) డాలర్లు పెరిగి 26.242డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.883 - 26.738 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications