నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి నేడు అతి స్వల్పంగా క్షీణించింది. పసిడి ధర ఇప్పటికీ రూ.45,000కు దిగువనే ఉంది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.11,500 తక్కువగా ఉంది. పసిడి నిన్న భారీగా పెరిగిన విషయం తెలిసిందే. బంగారం ఏప్రిల్ ఫ్యూచర్స్ ధరలు నిన్న రూ.619 పెరిగి రూ.44,837 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.661 పెరిగి రూ.45,092 వద్ద ముగిసింది. వెండి రూ.1,723 పెరిగి రూ.67,575 వద్ద క్లోజ్ అయింది. నేడు మాత్రం ప్రారంభ సెషన్లో మళ్లీ తగ్గింది.

నిన్న పెరిగి నేడు తగ్గిన ధరలు
గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా తగ్గింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ఉదయం సెషన్లో రూ.44,750 దిగువన ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.122.00 (-0.27%) తగ్గి రూ.44735.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,730.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,752.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,711.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,500 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.108.00 (-0.24%) తగ్గి రూ.45000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,966.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,966.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి 500 డౌన్
వెండి ధరలు తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.487.00 (-0.72%) తగ్గి రూ.66993.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,951.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,029.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,909.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.371.00 (-0.54%) తగ్గి రూ.68095.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,111.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,111.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,047.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

తగ్గినప్పటికీ 1700 డాలర్ల పైనే
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు తగ్గినప్పటికీ 1700 డాలర్లకు పైనే ఉంది. నేటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -6.30 (-0.37%) డాలర్లు తగ్గి 1,710.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో -6.30 (-0.37%) డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల దిగువకు చేరుకుంది. ఔన్స్ ధర 0.325 (-1.24%) డాలర్లు పెరిగి 25.858 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.845 - 26.152 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications