స్థిరంగా ధరలు: బంగారానికి ఈక్విటీ, చమురు ధరల దెబ్బ
బంగారం ధరలు నేడు (జూన్ 20, శనివారం) దాదాపు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 47,450 పలికింది. వెండి మాత్రం పెరిగి కిలో రూ.47,550 నుండి రూ.48,050కి చేరుకుంది. ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల ట్యాక్సులు, మేకింగ్ చార్జీలను బట్టి ఆయా రాష్ట్రాల్లో ధరలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 స్థిరంగా ఉంది. చెన్నైలో రూ.45,570 పలికింది. 24 క్యారెట్ల బంగారం ధరలు చెన్నైలో రూ.49,710 పలికింది.
ముందు సెషన్‌లో ఎంసీఎక్స్ ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 1.23 శాతం పెరిగి రూ.47,937 పలుకగా, వెండి జూలై ఫ్యూచర్స్ 1.62 శాతం పెరిగి కిలో రూ.48,636 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1 శాతం పెరిగి ఔన్స్ 1,740.03 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి 1,747.90 డాలర్లు పలికింది. స్పాట్ గోల్డ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో గత నెలలో 2012 గరిష్టానికి 1764.55కు చేరుకున్న విషయం తెలిసిందే.

అంతర్జాతీయ మార్కెట్లు కోలుకోవడం, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయనే వార్తలు, ముడి చమురు ధరలు పెరుగుతుండటం వంటి కారణాలు బంగారంపై ఒత్తిడిని తగ్గించాయి. దీంతో బంగారం ధరలు తగ్గడం లేదా స్థిరంగా ఉండటం జరుగుతోంది.


Click it and Unblock the Notifications