Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు నేడు (సోమవారం, మార్చి 28) భారీగా తగ్గాయి. చైనాలో కరోనా ఉధృతి నేపథ్యంలో షాంఘైలో లాక్‌డౌన్ ప్రకటించారు. అయితే సరఫరాలపై అంత ప్రభావం ఉండదని భావిస్తున్నారు. మరోవైపు, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై చర్చలు కాస్త సానుకూలంగా కనిపిస్తున్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు తగ్గి, ధరల తగ్గుదలకు కారణమవుతోంది. అదే సమయంలో మున్ముందు సాధారణ పరిస్థితి కనిపిస్తో పసిడి ధరలు మరింతగా తగ్గవచ్చుననే ఆందోళనల కారణంగా స్వల్పకాలిక ఇన్వెస్టర్లు బంగారం నుండి పెట్టుబడులను వెనక్కి తీసుకొని, ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి.

భారీగా తగ్గిన బంగారం ధరలు
మధ్యాహ్నం గం.11.45 సమయానికి ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.386 క్షీణించి రూ.51,490 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 392 క్షీణించి రూ.51,996 వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే తగ్గింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.645 లేదా 1 శాతం మేర క్షీణించి రూ.68,191 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.728 తగ్గి రూ.68,850 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.4700, ఇటీవలి గరిష్టంతో రూ.4000కు పైన తక్కువగా ఉంది.

1935 డాలర్ల దిగువకు
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. నేటి సెషన్‌లో కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్‌లో 19.15 (0.98%) డాలర్లు తగ్గి 1,935.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,954.2 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో 1,932.80 - 1,932.80 - 1,959.40 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.సిల్వర్ ఫ్యూచర్స్ 0.373 (-1.46%) డాలర్లు ఎగిసి 25.242 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 25.615 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్‌లో 25.140 - 25.790 డాలర్ల మధ్య కదలాడింది.

బంగారం మద్దతు ధర
బంగారం మద్దతు ధర రూ.51,660 నుండి రూ.51,480 వద్ద, నిరోధకస్థాయి రూ.52,050, నుండి 52,220 వద్ద కనిపిస్తోంది. బంగారం బై-జోన్ రూ.52,000, టార్గెట్ ధర రూ.52,300. సెల్ జోన్ రూ.51,600, టార్గెట్ ధర రూ.51,400. సాంకేతికంగా బంగారం మద్దతు ధర రూ.1943 వద్ద, ఆ తర్వాత 1935 వద్ద కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications