తగ్గుతోనే ఉంది... 51,000 దిగువకు బంగారం ధరలు
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారం ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం సెషన్‌లో రూ.369(0.72 శాతం) క్షీణించి 10 గ్రాములు రూ.50,984 పలికింది. బిజినెస్ టర్నోవర్ 12,529 లాట్లుగా ఉంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.416 క్షీణించి(0.81 శాతం) రూ.51,177 పలికింది. బిజినెస్ టర్నోవర్ 5,975 లాట్లుగా ఉంది. అక్టోబర్ కాంట్రాక్ట్ వ్యాల్యూ రూ.3,007.67 కోట్లుగా, డిసెంబర్ కాంట్రాక్ట్ వ్యాల్యూ రూ.284.18 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ అక్టోబర్ రూ.359 (0.70 శాతం) క్షీణించి రూ.51,074 పలికింది. బిజినెస్ టర్నోవర్ 16,808 లాట్లుగా ఉంది.

హైదరాబాద్‌లో బంగారం ధర
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.53,300 పలికింది. 22 క్యారెట్ల బంగారం రూ.48,850 వద్ద ట్రేడ్ అయింది. ఢిల్లీ మార్కెట్లో మాత్రం ఉదయం స్వల్పంగా పెరిగి 24 క్యారెట్ల పసిడి రూ.54,310, 22 క్యారెట్ల పసిడి రూ.49,800 పలికింది. వెండి ధర కిలో రూ.100కు పైగా దిగి వచ్చింది. రూ.68వేల లోపు పలికింది.ట
ముంబైలో 22 క్యారెట్ల పసిడి రూ.46,762 ప్లస్ జీఎస్టీ, 24 క్యారెట్ల పసిడి రూ.51,051 ప్లస్ జీఎస్టీ.

బంగారం మద్దతు.. నిరోధకస్థాయి
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న ముగింపు సమయానికి 0.5 శాతం పెరుగుదలతో క్లోజ్ అయిన ఔన్స్ బంగారం ధర ఈ రోజు 0.5 శాతం తగ్గుదలతో 1935 డాలర్ల వద్ద ప్రారంభమైంది. నిన్న ఓ సమయంలో బంగారం 1911 డాలర్లస్థాయికి పడిపోయింది. కానీ ఆ తర్వాత పుంజుకొని, కాస్త లాభాల్లో ముగిసింది. ఈ రోజు తగ్గుదలతో ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత స్వల్పంగా లాభపడి 1946 వద్ద ట్రేడ్ అయింది. బంగారం మద్దతు ధర 1900 డాలర్లు, నిరోధక స్థాయి 1,960 డాలర్లు. దేశీయ మార్కెట్లో మద్దతు ధర రూ.50,600, నిరోధకస్థాయి రూ.51,400.

పసిడిపై తగ్గిన ఒత్తిడి
ఆగస్ట్ నెలలో బంగారం ధర ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు పైన పలికింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గరిష్ట ధరతో పోలిస్తే రూ.5500 వరకు తక్కువగా ఉంది. సిక్స్ కరెన్సీ బాస్కెట్‌లో డాలర్ విలువ 0.45 శాతం పెరిగింది. దీంతో ఇతర కరెన్సీల్లో బంగారం ఖరీదుగా మారుతుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కూడా బంగరంపై ఒత్తిడిని తగ్గించిందని అంటున్నారు. ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications