బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ అక్టోబర్ ఫ్యూచర్స్ సాయంత్రం ట్రేడింగ్‌లో 10 గ్రాములు రూ.134 (0.26 శాతం) పెరిగి రూ.50,812 పలికింది. డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.158 పెరిగి (0.58 శాతం) రూ.51,063 పలికింది. అక్టోబర్ ఫ్యూచర్స్ 13,857 లాట్లు, డిసెంబర్ ఫ్యూచర్స్ టర్నోవర్ 5,307 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ రెండూ వరుసగా రూ.1,827.89 కోట్లు, రూ.180.76 కోట్లుగా ఉంది. వెండి కిలో డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.754 పెరిగి రూ.68,020 పలికింది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ అక్టోబర్ రూ.121 (0.24 శాతం) పెరిగి రూ.50,882 పలికింది. బిజినెస్ టర్నోవర్ 16,811 లాట్లుగా ఉంది.

ఎంసీఎక్స్‌లో మద్దతు ధర, నిరోధకస్థాయి
ఎంసీఎక్స్‌లో పసిడి ధర రూ.50,550 స్థాయి మద్దతు ధర. నిరోధకస్థాయి రూ.50,970. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. లండన్ ట్రేడింగ్‌లో ఔన్స్ పసిడి 4.91 డాలర్లు దిగి వచ్చి 1,928.99 డాలర్లు పలికింది. ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధర రికార్డ్ ధర రూ.56,200కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రష్యా వ్యాక్సీన్ రాకతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. ఆ తర్వాత నుండి బంగారం ధరలు భారీగా తగ్గాయి. అప్పుడప్పుడు స్వల్పంగా పెరుగుతూ, అదేస్థాయిలో తగ్గుతున్నాయి.

ఈ వారం అస్థిరంగా..
ఈ వారం బంగారం ధరలు అస్థిరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కీలక మద్దతు ధర ట్రాయ్ ఔన్స్ 1900-1910 డాలర్లు, నిరోధక స్థాయి 1972-1984. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర రూ.50,000 నుండి రూ.49,800. నిరోధకస్థాయి రూ.51,100 నుండి రూ.51,330. వెండి మద్దతు ధర అంతర్జాతీయ మార్కెట్లో ట్రాయ్ ఔన్స్ 26.50-26.20 డాలర్లు, నిరోధకస్థాయి 27.80-28.20 డాలర్లు. ఎంసీఎక్స్‌లో మద్దతు ధర కిలో రూ.65,000 నుండి 64,500, నిరోధకస్థాయి రూ.69,100 నుండి రూ.69,500.

హైదరాబాద్‌లో ధరలు..
హైదరాబాద్‌లో ఉదయం బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి స్వల్పంగా పెరిగి రూ.48,900 పలికింది. 24 క్యారెట్ల పసిడి కూడా స్వల్పంగా పెరిగి రూ.53,320కు చేరుకుంది. వెండి ధర కిలో రూ.200 వరకు పెరిగి రూ.67వేల పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు, డాలర్, భౌగోళిక ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్, ప్రస్తుతం కరోనా మహమ్మారి, వ్యాక్సీన్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.


Click it and Unblock the Notifications