For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంసీఎక్స్‌లో పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. గురువారం ఉదయం తగ్గుముఖం పట్టిన ధరలు ఆ తర్వాత పెరుగుదలను నమోదు చేశాయి. రాత్రి గం.10 సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ 112.00 (0.22%) పెరిగి రూ.50,654 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం రూ.50,314 వద్ద ప్రారంభమైన పసిడి రూ.50,713 గరిష్టాన్ని, రూ.50,280 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇప్పటికీ ఆగస్ట్ 7 ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే రూ.5,500కు పైగా తక్కువ పలుకుతోంది. గత కొద్ది రోజులుగా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

దేశంలో ఫస్ట్ టైం డిజిటల్ క్రెడిట్ కార్డు... రూ.2 లక్షల వరకు వెంటనే రుణందేశంలో ఫస్ట్ టైం డిజిటల్ క్రెడిట్ కార్డు... రూ.2 లక్షల వరకు వెంటనే రుణం

పెరిగిన పసిడి ధర, తగ్గిన వెండి ధర

పెరిగిన పసిడి ధర, తగ్గిన వెండి ధర

పసిడి ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.126(0.25 శాతం) పెరిగి 10 గ్రాములు రూ.50,750 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,552 వద్ద ఓపెన్ కాగా, రూ.50,830 వద్ద గరిష్టాన్ని, రూ.50,425 వద్ద కనిష్టాన్ని తాకింది.ఫ్యూచర్ మార్కెట్లు పసిడి ధరలు పెరగగా, వెండి ధరలు క్షీణించాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్ కిలో 373.00 (0.61%) క్షీణించి రూ.61,230 వద్ద ట్రేడ్ అయింది. రూ.61,545 వద్ద గరిష్టాన్ని, రూ.59,820 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్ కిలో రూ.320.00 (-0.50%) క్షీణించి రూ.63,099 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,192 వద్ద గరిష్టాన్ని, రూ.61,766 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు క్షీణించాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.03 శాతం క్షీణించి ఔన్స్ 1,906.95 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,893.15 - 1,910.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు 1907.30 డాలర్లు పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.71 శాతం క్షీణించి 24.223 డాలర్లు పలికింది. నేటి ట్రేడింగ్‌లో 23.652 - 24.410 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.395 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

పెరిగే అవకాశం

పెరిగే అవకాశం

అమెరికాలో కరోనా మహమ్మారి ఆర్థిక ప్యాకేజీపై చర్చలు నిలిచిపోవడం, పలుదేశాల్లో కేసులు పెరుగుతుండటం పసిడిపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో ఈ వారం తదుపరి సెషన్‌లలో పసిడి ధర పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే మన మార్కెట్లు కుప్పకూలడం సహా వివిధ కారణాలతో దేశీయంగా పసిడి ధరలు పెరిగాయని గుర్తు చేస్తున్నారు.

English summary

ఎంసీఎక్స్‌లో పెరిగిన బంగారం ధర, తగ్గిన వెండి ధర | Gold prices steady at Rs 50,663, silver declines by Rs 375

Gold and silver prices today moved higher in Indian markets, tracking softer global rates as chances of a US stimulus package being rolled out before the November elections faded.
Story first published: Thursday, October 15, 2020, 22:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X