హైదరాబాద్: దేశంలో బంగారం, వెండి రేట్లు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. వాటి ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో ఈ పెరుగుదల కనిపించింది. అంతకుముందు రోజు నాటి బంగారం ధరల ట్రేడింగ్‌తో పోల్చుకుంటే ఇవ్వాళ కొద్దిగా పైకి ఎగబాకాయి. పసిడి రేటు మళ్లీ పరుగులు తీసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. వచ్చే వారం బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో మరింత పెరుగుదల కనిపించవచ్చని అభిప్రాయపడుతున్నాయి.
బంగారం 263 రూపాయల మేర పెరిగింది. వెండి రేటు దీనికి రెట్టింపయింది. 500 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,472 రూపాయలుగా నమోదైంది. కిందటి రోజు ట్రేడింగ్ ప్రకారం చూసుకుంటే-10 గ్రాముల బంగారం ధర 52,209 రూపాయలు. 263 రూపాయల మేర పెరిగి 52,472 రూపాయల వద్ద నిలిచింది. వెండి కేజీ ఒక్కింటికి 67,207 రూపాయల నుంచి 67,707 రూపాయలకు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ట్రేడింగ్ వేల్యూ ఔన్సుకు 1,952 డాలర్లు, వెండి ఔన్సుకు 24.45 డాలర్లుగా రిజిస్టర్ అయింది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణం కారణంగా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల చోటు చేసుకున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అంచనా వేశారు. వచ్చే వారం ఈ ఎల్లో మెటల్ రేటు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 49,300 రూపాయలుగా నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 53,780 రూపాయల వద్ద నిలిచింది. బెంగళూరులో 22 క్యారెట్లు 49,300, 24 క్యారెట్లు 53,780 రూపాయలకు చేరింది. చెన్నై బులియన్ మార్కెట్‌లోలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 49,650 రూపాయలు, 24 క్యారెట్లు 54,160 రూపాయలు. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 53,780 రూపాయలుగా ఉంటోంది. 22 క్యారెట్ల బంగారం 49,300 రూపాయలు.
అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు 49,350, 24 క్యారెట్లు 10 గ్రాములకు 53,830 రూపాయలుగా నమోదైంది. కోయంబత్తూర్‌లో 22 క్యారెట్ల బంగారం 49,650 రూపాయలు, 24 క్యారెట్లు 54,160 రూపాయలకు చేరింది. మధురైలో 22 క్యారెట్ల బంగారం 48,220 రూపాయలు, 24 క్యారెట్లు 52,600 రూపాయలకు చేరింది. పాట్నాలో 24 క్యారెట్ల బంగారం 51,790, 22 క్యారెట్లు 47,480 రూపాయలుగా నమోదైంది. చండీగఢ్‌లో 22 క్యారెట్లు 49,450, 24 క్యారెట్లు 49,450 రూపాయలు.
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications