ఐదు రోజులు పాటు వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. నేడు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, రూపాయి మారకం విలువలో మార్పులు, బంగారం నిల్వలు వంటి అనేక కారణాలతో బంగారం ధరలలో మార్పు చోటు చేసుకుంటుంది. ఇక అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా దేశీయంగా పెరిగిన బంగారం ధరల విషయానికి వస్తే తాజాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 300 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయల మేర నేడు ధర పెరిగింది.
నేడు హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60, 760 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 55,850 రూపాయలుగా కొనసాగుతుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 వేల 910 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలుగా విక్రయించబడుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,750 ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బెంగళూరులో 60 వేల 810 రూపాయలుగా విక్రయించబడుతుంది. కలకత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700గా విక్రయించబడుతుంటే, 24 క్యారెట్ల బంగారం ధర కలకత్తాలో 60,760 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు లలో బంగారం ధరల విషయానికొస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,700 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,760 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశంలోనే బంగారం ధరలు ఎక్కువ ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, ఈ రోడ్, తిరుపూర్, తిరుచ్చి, తిరునవ్వేలిలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,300గా ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,420గా ప్రస్తుతం కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications