బంగారం ధరలు వరుసగా రెండో రోజు (ఏప్రిల్ 6) తగ్గాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.100 తగ్గి రూ.45,650 పలికింది. వెండి ధర 0.5 శాతం పెరిగి రూ.42,134గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్ ధర 1,704.88 వద్ద ఉంది. ప్లాటినమ్ ఔన్స్ 0.2 శాతం తగ్గి 763.05 డాలర్లు, వెండి ఔన్స్ 0.1 శాతం తగ్గి 15.01 పలికింది.

పెరుగుతున్న పెట్టుబడులు
బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. మరోవైపు పసిడిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రపంచ అతిపెద్ద పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం మంగళవారం 0.4 శాతం పెరిగి 1,076.39కి పెరిగింది. అంతకుముందు సోమవారం 1,071.71 టన్నులు ఉంది.

హైదరాబాద్, బెంగళూరులలో ఎంత తగ్గిందంటే
నేడు బెంగళూరులో బంగారం ధరలు ఎక్కువగా పడిపోయాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.850 తగ్గగా, 24 క్యారెట్ల బంగారం రూ.790 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రూ.150, 24 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గింది. భాగ్యనగరంలో 22 క్యారెట్ల బంగారం రూ.43,900, 24 క్యారెట్ల బంగారం రూ.46,600 పలికింది.

99.9% పడిపోయిన బంగారం దిగుమతులు
మరోవైపు, ఏప్రిల్ నెలలో బంగారం దిగుతులు ఏకంగా 99.9 శాతం పడిపోయాయి. మూడు దశాబ్దాల కనిష్టానికి తగ్గిపోయాయి. ప్రపంచంలోని అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో భారత్ రెండో స్థానంలో ఉంటుంది. గత నెలలో దిగుమతులు కేవలం 50 కిలోలు మాత్రమే. అంతకుముందు ఇదే ఏఢాది ఇదే ఏప్రిల్ నెలలో 110.18 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది. వ్యాల్యూ పరంగా 3.97 బిలియన్ డాలర్ల నుండి ఏకంగా 2.84 మిలియన్ డాలర్లకు పడిపోయింది. కరోనా, లాక్ డౌన్ వంటి వివిధ కారణాల వల్ల ఈ ఏఢాది బంగారం దిగుమతులు 350 టన్నులకు పడిపోవచ్చునని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications