ఇటీవల తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పెరిగింది. చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్, డాలర్‌తో రూపాయి మారకం విలువ, స్థానిక వ్యాపారుల నుండి డిమాండ్ వంటి వివిధ కారణాల వల్ల మంగళవారం ధరలు పెరిగాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరిగాయి.

బంగారం ధర ఎంత పెరిగిందంటే
ఎంసీఎక్స్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 18) ఉదయం గం.9.20 సమయానికి 10 గ్రాముల పసిడి రూ.220 పెరిగి రూ.40,976కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,586.19 డాలర్లకు పెరిగింది. గత పదిహేను రోజుల్లో అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుండి అత్యధిక ధర ఇదే. ఆ రోజున 1,586.90 డాలర్లుగా ఉంది.

మళ్లీ రూ.41 వేలు దాటొచ్చు
పసిడి ధర త్వరలో మళ్లీ రూ.41,000 దాటవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బంగారం ధర 10 గ్రాములు రూ.50,000కు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి ధర కూడా కిలోకు రూ.222 పెరిగి రూ.46,345కు చేరుకుంది.

బంగారం పెరగడానికి కారణాలు..
బంగారం ధరలు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడంతో పాటు కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉందని అంచనాలు ఉండటంతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వంటి అతి ఖరీదైన లోహాల వైపు దృష్టి సారిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications