బంగారం, వెండి ధరలు నేడు (జూన్ 21, సోమవారం) స్వల్పంగా పెరిగాయి. క్రితం వారంలో పసిడి ఫ్యూచర్ దాదాపు రూ.2000 వరకు క్షీణించింది. నేడు కూడా బలహీనంగా ప్రారంభ సెషన్లో బలహీనంగా కనిపించినప్పటికీ, ఆ తర్వాత లాభపడింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.46,650త దిగువకు వచ్చింది. అంతలోనే రూ.47,000కు చేరువైంది. సిల్వర్ ప్యూచర్స్ అతి స్వల్పంగా పెరిగినప్పటికీ రూ.67,800 దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1780 డాలర్లు, సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల వద్ద ఉంది. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9300 తక్కువగా ఉంది.

పెరిగిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.222.00 (0.48%) పెరిగి రూ.46950.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,967.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,633.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.152.00 (0.32%) పెరిగి రూ.47201.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,144.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,201.00 గరిష్టాన్ని, రూ.46,906.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి భారీగా డౌన్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.159.00 (0.24%) పెరిగి రూ.67757.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,647.00 వద్ద ప్రారంభమై, రూ.67,945.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.66,628.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.207.00 (0.30%) పెరిగి రూ.68856.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,678.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,950.00 గరిష్టాన్ని, రూ.67,717.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 7.30 (0.41%) డాలర్లు పెరిగి 1,776.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,764.60 - 1,779.90 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.008 (0.03%) డాలర్లు పెరిగి 25.973 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.582 - 26.110 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!



Click it and Unblock the Notifications