Gold prices today: పెరిగిన బంగారం ధరలు, ఐనా రూ.45,000కు దిగువనే

ముంబై: గత కొంతకాలంగా క్షీణిస్తున్న బంగారం ధరలు నేడు (మార్చి 24, బుధవారం) స్వల్పంగా పెరిగాయి. నేడు రిటైల్ మార్కెట్‌లో క్షీణించాయి. పది గ్రాముల పసిడి రూ.800 పడిపోయింది. 22 క్యారెట్ల పసిడి రూ.43,000, 24 క్యారెట్ల బంగారం రూ.44,000 వద్ద ఉంది. మార్చి 19వ తేదీ నుండి పసిడి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. అయితే నేడు మాత్రం అతి స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.11,400 తక్కువగా ఉంది. యూఎస్ బాండ్ యీల్డ్స్ తగ్గిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.

బంగారం ధరలు జంప్

బంగారం ధరలు జంప్

గోల్డ్ ఫ్యూచర్ నేడు ఉదయం సెషన్‌లో పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.187.00 (0.42%) పెరిగి రూ.44833.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.44,800.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,877.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,784.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,400 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.197.00 (0.44%) పెరిగి రూ.45219.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,100.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,242.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,100.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పెరిగిన వెండి

పెరిగిన వెండి

రెండు రోజుల్లో రూ.2వేలకు పైగా తగ్గిన వెండి ధరలు నేడు పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.319.00 (0.49%) పెరిగి రూ.65291.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,139.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.65,334.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,139.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కిలో రూ.336.00 (0.51%) పెరిగి రూ.66380.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,257.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,393.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,257.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1750 డాలర్ల దిశగా

1750 డాలర్ల దిశగా

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ 1750డాలర్ల దిశగా వెళ్తున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.95 (0.40%) డాలర్లు పెరిగి 1,731.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,722.50 - 1,733.45 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 25 డాలర్ల పైన ట్రేడ్ అవుతోంది. ఔన్స్ ధర 0.007 (0.03%)డాలర్లు తగ్గి 25.220 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.025 - 25.295 డాలర్ల మధ్య కదలాడింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+