For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.275 పెరిగిన బంగారం ధర, రూ.1,100 పెరిగిన వెండి ధర

|

బంగారం, వెండి ధరలు బుధవారం (అక్టోబర్ 14) పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10గ్రాముల డిసెంబర్ పసిడి ఫ్యూచర్ ధర రాత్రి గం.10.00 సమయానికి రూ.275 (0.55 శాతం) పెరిగి రూ.50,520 పలికింది. నేడు రూ.50,369 వద్ద ప్రారంభమై, రూ.50,740 వద్ద గరిష్టాన్ని, రూ.50,270 వద్ద కనిష్టాన్ని తాకింది. మార్చిలో కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత నుండి ఆగస్ట్ మొదటి వారం వరకు పసిడి ధరలు వేగంగా పెరిగాయి. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200కు చేరుకున్నాయి. ఆ ధరతో చూస్తే ప్రస్తుతం రూ.5,700 తక్కువ ఉంది.

శాలరీ పెంపు, ప్రమోషన్లు: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్, 16,500 ఫ్రెషర్స్‌కు ఛాన్స్శాలరీ పెంపు, ప్రమోషన్లు: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్, 16,500 ఫ్రెషర్స్‌కు ఛాన్స్

రూ.250 వరకు పెరిగిన పసిడి

రూ.250 వరకు పెరిగిన పసిడి

ఎంసీఎక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ ధర రూ.240 పెరిగి రూ.50,485 పలకగా, ఫిబ్రవరి ఫీచర్స్ రూ.290(0.58 శాతం) పెరిగి రూ.50,617 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం రూ.50,529 వద్ద ప్రారంభమై, రూ.50,796 వద్ద గరిష్టాన్ని, రూ.50,417 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.1126 (1.86 శాతం) పెరిగి రూ.61,668 వద్ద ట్రేడ్ అయింది. రూ.60,725 వద్ద ప్రారంభమై, రూ.62,282 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ.60,601 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్ కిలో రూ.790 (1.27 శాతం) తగ్గి రూ.63,224 వద్ద ట్రేడ్ అయింది. వెండి ఉదయం రూ.62,767 వద్ద ప్రారంభమై, రూ. 64,020 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ.62,487 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో అప్

అంతర్జాతీయ మార్కెట్లో అప్

అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 0.61 శాతం పెరిగి ఔన్స్ 1,906.35 డాలర్లు పలికింది. ఈ రోజు 1,885.15 - 1,917.45 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. నిన్నటి సెషన్‌లో 1894.60 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. పసిడి అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ 1900 డాలర్లను దాటింది.

వెండి ఫ్యూచర్స్ 1.24 శాతం పెరిగి ఔన్స్ 24.427 డాలర్లు పలికింది. 23.935 - 24.725 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.129 వద్ద క్లోజ్ అయింది.

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బులియన్ మార్కెట్లో పసిడి ధరలు 24 గ్రాములు రూ.53,090, 22 క్యారెట్ల పసిడి రూ.48,650 పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి రూ.54,080, 22 క్యారెట్ల పసిడి రూ.49,550 పలికింది. వెండి ధరలు కిలో రూ.62,600 పైకి చేరుకున్నాయి.

English summary

రూ.275 పెరిగిన బంగారం ధర, రూ.1,100 పెరిగిన వెండి ధర | Gold prices rise sharply to Rs 50,484 per 10 gram

Gold and silver prices today rise sharply in Indian markets. On MCX, December gold futures were up 0.48% at ₹50,485 per 10 gram while silver futures plunged 1.61% or ₹975 to ₹61517 per kg.
Story first published: Wednesday, October 14, 2020, 22:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X