భారీగా పెరిగిన బంగారం ధర, కొద్దిరోజుల్లో ఆ రికార్డుకు పసిడి!
బంగారం, వెండి ధరలు మంగళవారం పెరిగాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.761 పెరిగి రూ.48,414కు చేరుకుంది. సోమవారం రూ.47,653 వద్ద క్లోజ్ అయింది. కిలో వెండి ధర రూ.1,308 పెరిగి సోమవారం నాటి రూ.47,896 నుండి రూ.49,204కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం 1,731కి, వెండి 17.49 డాలర్లకు చేరుకుంది.

అందుకే పెరిగాయి
గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల, రూపాయి క్షీణత తదితర కారణాలతో బంగారం ధర పెరిగింది. కరోనా మహమ్మారి కేసులు, రెండోసారి ఈ వైరస్ విజృంభణ అంశాలు పెట్టుబడిదారులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. చైనాలో రెండోసారి కరోనా విజృంభన బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.

1800 డాలర్లకు
కార్పోరేట్ డెట్‌కు సంబంధించి ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటన కూడా బంగారం ధర పెరగడానికి కారణమైంది. ఫెడ్‌తో పాటు ఇతర కేంద్ర బ్యాంకులు మార్కెట్లోకి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని పంపింగ్ చేయడం బంగారం ర్యాలీకి కూడా ఉపయోగపడుతుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్యాలెండర్ ఇయర్ (2020) రెండో అర్ధ సంవత్సరంలో బంగారం 1800 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే మొదటి అర్ధ సంవత్సరం పూర్తవుతోంది. అంటే త్వరలో ఈ ధరకు చేరుకోవచ్చు.

ముంబైలో ధర
భారత వాణిజ్య నగరం ముంబైలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,547 (జీఎస్టీ అదనం) పలికింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,540 పలికింది (జీఎస్టీ అదనం). అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 1715 డాలర్ల నుండి 1755 డాలర్ల మధ్య ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications