For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర తగ్గి, వెండి ధర పెరిగింది: అదే ధర వద్ద కొనసాగే ఛాన్స్

|

దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించగా,వెండి ధరలు పైకి ఎగిశాయి. శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ 170.00(-0.34%) క్షీణించి రూ.50,542 పలికింది. ఉదయం 50,586 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. రూ.50,813 వద్ద గరిష్టాన్ని, రూ.50,452 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 ధరలతో పోలిస్తే ఇప్పటికీ రూ.5,600 వరకు తక్కువ పలుకుతోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు పసిడి ధరలు వేగంగా పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ధరలు రూ.49వేల పై నుండి రూ.51వేల మధ్య పలుకుతున్నాయి.

బంగారం పెరిగి, వెండి ధర తగ్గింది

బంగారం పెరిగి, వెండి ధర తగ్గింది

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.119.00 (0.23%) క్షీణించి రూ.50642 పలికింది. రూ.50,811 ప్రారంభమైన ధర రూ.50,931 గరిష్టాన్ని తాకి, రూ.50,615 కనిష్టాన్ని తాకింది.

నేడు బంగారం ధర తగ్గగా, వెండి ధర మాత్రం పెరిగింది. అయితే స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.189.00 (0.31%) పెరిగి రూ.61724 పలికింది. రూ. 61,649 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,170 వద్ద గరిష్టాన్ని, రూ.61,324 కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్ రూ.91.00 (0.14%) పెరిగి రూ.63,338 వద్ద ట్రేడ్ అయింది. కిలో రూ.63,377 వద్ద ప్రారంభమై, రూ.63,800 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని, రూ.62,976 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను అదే ధోరణి

అంతర్జాతీయ మార్కెట్లోను అదే ధోరణి

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 0.14% శాతం క్షీణించి 1,906 డాలర్లు పలికింది. ఈ రోజు 1,901.25 - 1,918.55 డాలర్ల మధ్య బంగారం ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌‌లో 1,908.90 డాలర్ల వద్ద ముగిసింది.

సిల్వర్ ఫ్యూచర్స్ +0.66% శాతం పెరిగి ఔన్స్ ధర 24.375 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 24.247 - 24.657 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 24.443 డాలర్లు పలికింది.

ధరలు ఈ మధ్య ఉండొచ్చు

ధరలు ఈ మధ్య ఉండొచ్చు

అమెరికా ఆర్థిక ప్యాకేజీపై క్లారిటీ వచ్చినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1,880-1,930 డాలర్ల మధ్య పలుకుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లో రూ.50,400-రూ.51,000 మధ్య ట్రేడ్ కావొచ్చునని చెబుతున్నారు.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,740 పలికింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.48,310 పలికింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.53,730, 22 క్యారెట్ల పసిడి రూ.49,250 పలికింది.

English summary

బంగారం ధర తగ్గి, వెండి ధర పెరిగింది: అదే ధర వద్ద కొనసాగే ఛాన్స్ | Gold prices rise Rs 170 to Rs 50,542, silver up Rs 190

Gold prices rose by Rs 242 to Rs 50,905 per 10 gram in the Mumbai retail market on a weaker dollar and lacklustre global cues. The precious metal is up Rs 27, or 0.05 percent, this week.
Story first published: Friday, October 16, 2020, 22:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X