బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ డెలివరీ 10 గ్రాములు రూ.245 (0.48 శాతం) తగ్గి రూ.50,820 పలికింది. బిజినెస్ టర్నోవర్ 13,351 లాట్లుగా ఉంది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.163(0.32 శాతం) తగ్గి రూ.51,081 పలికింది. ఈ బిజినెస్ టర్నోవర్ రూ.5,510 లాట్లుగా ఉంది. అక్టోబర్, డిసెంబర్ కాంట్రాక్ట్ వ్యాల్యూ వరుసగా రూ.3,501.11 కోట్లు, రూ.138.52 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ అక్టోబర్ కాంట్రాక్ట్ రూ.228 (045 శాతం) క్షీణించి రూ.50,921 పలికింది. టర్నోవర్ 16,604 లాట్స్‌గా ఉంది.

వరుసగా తగ్గుముఖం
బంగారం ధరలు గత ఐదు రోజుల్లో నాలుగు రోజులు తగ్గాయి. నిన్న ఒక్కరోజే పసిడి ధర పెరిగాయి. మిగిలిన రోజులు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పడిపోవడంతో ఈ ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పైన పడింది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఫ్యూచర్స్ 0.6 శాతం పడిపోయి రూ.67,850 పలికింది. బంగారం ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టంతో పోలిస్తే రూ.5000కు పైగా తక్కువగానే ఉన్నాయి. నెలలో వెండి రూ.10వేలు తగ్గాయి.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 0.2 శాతం తగ్గుదలతో 1,935 డాలర్లు పలికింది. డాలర్ ఇండెక్స్ 0.45 శాతం పెరిగింది. దీంతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. అంతర్జాతీయంగా కరోనా మహమ్మారి కేసులు పెరగడంతో బంగారం ధర తగ్గుదల పరిమితంగా ఉంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.2 శాతం తగ్గి 26.84 డాలర్లు, ప్లాటినమ్ 0.6 శాతం పెరిగి 900.01 డాలర్లు పలికింది.

నగరాల్లో ధరలు
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.40 దిగి వచ్చి రూ.48,850, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి దాదాపు అంతే తగ్గి రూ.53,290 పలికింది. 22 క్యారెట్ల బంగారం కేరళలో రూ.46,900, పుణే రూ.49,590, అహ్మదాబాద్ రూ.49,,590, జైపూర్ రూ.49,650 పలికింది. 24 క్యారెట్ల పసిడి చెన్నైలో రూ.53,290, ముంబైలో రూ.50,590, ఢిల్లీలో రూ.54,160, కోల్‌కతాలో రూ.53,920, బెంగళూరులో రూ.52,520 పలికింది.


Click it and Unblock the Notifications