నేడు (అక్టోబర్ 20, మంగళవారం) ప్రారంభ సెషన్‌లో తగ్గిన బంగారం ధరలు ఆ తర్వాత పుంజుకున్నాయి. సాయంత్రం సెషన్ సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్ గోల్డ్ రూ.142(0.28 శాతం) పెరిగి రూ.50,829 పలికింది. పసిడి మరోసారి రూ.51వేల సమీపానికి చేరుకుంది. రూ.50,600 వద్ద ప్రారంభమైన పసిడి రూ.50,885 వద్ద గరిష్టాన్ని, రూ.50,491 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.202 (0.40 శాతం) పెరిగి రూ.50,946 పలికింది. రూ.50,638 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,946 వద్ద గరిష్టాన్ని, రూ.50,620 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్ట రూ.56,200తో పసిడి ఇప్పటికీ రూ.5,300కు పైగా తక్కువ పలుకుతోంది.

బంగారం దారిలో వెండి
బంగారం ధర రెండో సెషన్‌లో పెరుగుదల నమోదు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఆ మేరకు ధర స్వల్పంగా పెరిగింది. రూ.50,400 వద్ద కొనుగోలు చేయవచ్చునని, స్టాప్ లాస్ రూ.50,200 వద్ద, టార్గెట్ ధర రూ.51,000గా కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
ఇక, ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధర పెరగగా, వెండి కూడా అదే దారిలో నడిచింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.747 (1.20 శాతం) పెరిగి రూ.62,842 పలికింది. మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.682 (1.07 శాతం) పెరిగి రూ.64,380 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. కామెక్స్‌లో ఔన్స్ పసిడి 0.03 శాతం పెరిగి 1,912.40 డాలర్లు పలికింది. 1,896.95 - 1,915.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1911.70 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఉదయం 1906.50 డాలర్ల వద్ద ప్రారంభమైంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.65 శాతం పెరిగి 24.858 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24.410 - 25.027 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 24.698 డాలర్ల వద్ద ముగిసింది. ఉదయం 24.505 డాలర్ల వద్ద ప్రారంభమైంది.

వేచిచూస్తున్న ఇన్వెస్టర్లు
అమెరికా ఎన్నికలు, అగ్రరాజ్యం ఆర్థిక ప్యాకేజీపై మరింత క్లారిటీ కోసం ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి 1906.26 డాలర్లు పలికింది. అయితే ఈ రోజు డాలర్ సూచీ 0.2 శాతం క్షీణించడంతో పసిడి ధర స్వల్పంగా పుంజుకుంది.
More From GoodReturns

ఐస్ క్రీం బండి మీద తక్కువ ధరకే బంగారం అమ్మకం.. విశాఖ బీచ్ వద్ద ఎగబడుతున్న కస్టమర్లు. .వీడియో ఇదిగో..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు పతనం.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? బిస్కెట్లు, కాయిన్స్ ఎక్కడ కొంటే ఎక్కువ లాభం?

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications