బంగారం.. ఈ పేరు చెబితే జనాలకు ఎంత ఇష్టమో.. కానీ ప్రస్తుతం బంగారం పేరు చెబితేనే జనాలు పారిపోయే పరిస్థితి వచ్చింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేనంతగా బంగారం ధరలు పెరగడం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి వరుసగా షాకలిస్తూ వస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం విపరీతంగా పెరిగి ఆల్ టైం హై కు చేరుకుంటున్న పరిస్థితి ఉంది.
60 వేలకు పైగా స్వచ్ఛమైన బంగారం ధరలు పెరగడం బంగారం ప్రియులను షాక్ కు గురిచేస్తుంది. దేశంగా ఈరోజు బంగారం ధరలు ఏ విధంగా పెరిగాయంటే.. భారతదేశంలో బంగారం ధరలు నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 500 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 550 రూపాయల మేర ధర పెరిగింది.

నేడు హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,200గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,310 గా ప్రస్తుతం విక్రయించబడుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,350 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశ రాజధాని ఢిల్లీలో 61,460 రూపాయలు గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,200గా ప్రస్తుతం విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,310 అవుతుంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 56,250గా విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,360 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

కలకత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,200గా ప్రస్తుతం విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,310గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, ప్రకాశం, కడప, కర్నూలు, తిరుపతిలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,200రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,310 గా కొనసాగుతుంది .
దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలో నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,800 ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61 వేల 960 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, ఈరోడ్, తిరుపూర్, తిరుచ్చి, తిరునవ్వేలిలో స్వచ్ఛమైన బంగారం ధర 62,000 మార్కును తాకుతుంది.


Click it and Unblock the Notifications