బంగారం భగ్గుమంటోంది.సామాన్య,మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా ధరల దూకుడు కొనసాగిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు 2020 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగానే బంగారం ధర విషయానికి వస్తే నేడు కూడా బంగారం ధర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది.
నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 100 రూపాయలు పెరిగి 56,700 రూపాయల వద్ద బంగారం విక్రయించబడుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 100 రూపాయలు పెరిగి 61,850 రూపాయల వద్ద ప్రస్తుతం బంగారం ట్రేడవుతోంది. హైదరాబాద్ లో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు 56,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,850 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర 62 వేల రూపాయల వద్ద విక్రయించబడుతుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,700 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయల వద్ద విక్రయించబడుతుంది. బెంగళూరు లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,750 రూపాయల వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61వేల 900 రూపాయల వద్ద విక్రయించబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి నెలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,700 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 61,850 రూపాయలుగా విక్రయించబడుతుంది.
భారతదేశంలోనే బంగారం ధరలు ఎక్కువగా ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై,మధురై, కోయంబత్తూర్, సేలం, ఈ రోడ్, తిరుచ్చి, తిరునవ్వేలి, తిరుపూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 57,200 రూపాయలుగా ట్రేడవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,400 రూపాయలుగా విక్రయించబడుతుంది.


Click it and Unblock the Notifications