Gold prices today: బంగారం ధరలు పెరిగాయి, అదే దారిలో వెండి...
నిన్న భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు(జూలై 30 బుధవారం) స్వల్పంగా పెరిగాయి. నిన్న రూ.400 వరకు తగ్గిన పసిడి నేడు రూ.150 వరకు పెరిగింది. నిన్న ఓ సమయంలో రూ.700 వరకు తగ్గింది. ఆ తర్వాత రూ.46,600 దిగువన క్లోజ్ అయింది. నేడు రూ.150 వరకు పెరిగి రూ.46,700 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధరలు రూ.68000 దిగువనే ఉంది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.9500 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12000 వరకు తక్కువగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.145.00 (0.31%) పెరిగి రూ.46700.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,594.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,755.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,461.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.135.00 (0.29%) పెరిగి రూ.47000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,886.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,050.00 గరిష్టాన్ని, రూ.46,752.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలూ తగ్గాయ్
జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.688.00 (1.02%) పెరిగి రూ.67920.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,277.00 వద్ద ప్రారంభమై, రూ.68,014.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,277.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.536.00 (0.79%) పెరిగి రూ.68810.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,308.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,989.00 గరిష్టాన్ని, రూ.68,243.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లోనూ
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు భారీగా పెరిగియి. 1770 డాలర్ల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు +4.70
(+0.27%) డాలర్లు పెరిగి 1,768.25 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,753.20 - 1,768.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. 0.265 (1.02%) డాలర్లు పెరిగి 26.13 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.802 - 26.157 డాలర్ల మధ్య కదలాడింది.


Click it and Unblock the Notifications