Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర, వెండి స్వల్పంగా జంప్
ముంబై: బంగారం ధరలు మంగళవారం (డిసెంబర్ 15) భారీగా పెరిగాయి. గత వారం నుండి పసిడి ధరలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరంగా ఉన్నాయి. అమెరికాలో ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి సానుకూల సంకేతాలు రావడంతో పసిడిపై ప్రభావం పడింది. ఉద్దీపన చర్యల వల్ల ద్రవ్యోల్భణంపై ప్రభావం పడుతుందని, ఇది బంగారం పెరగడానికి దోహదపడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.రూ.6800 వరకు తక్కువగా ఉంది.

రూ.400కు పైగా పెరిగిన బంగారం
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.431.00 (0.88%) పెరిగి రూ.49,370 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,035.00 ప్రారంభమై, రూ.49,589.00 గరిష్టాన్ని తాకి, రూ.49,007.00 కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.430.00 (0.88%) పెరిగి రూ.49400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,082.00 వద్ద ప్రారంభమై, రూ.49,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,082.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

సిల్వర్ 700 జంప్
సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.700 పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ రూ.679.00 (1.07%) పెరిగి రూ.64150.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,604.00 వద్ద ప్రారంభమై, రూ.64,390.00 గరిష్టాన్ని తాకి, రూ.63,599.00 కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ 614.00 (0.95%) పెరిగి రూ.64937.00 ట్రేడ్ అయింది. రూ.64,605.00 ప్రారంభమై, 65,212.00 గరిష్టాన్ని తాకి, రూ.64,586.00 కనిష్టాన్ని తాకింది.

అక్కడా జంప్
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 1 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 20.35 (+1.11%) డాలర్లు పెరిగి 1,852.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,828.55 - 1,859.30 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 21.43 శాతం పెరిగింది.సిల్వర్ ఫ్యూచర్స్ 0.551 (+2.29%) డాలర్లు పెరిగి 24.598 డాలర్లకు చేరింది. 23.942 - 24.692 డాలర్ల మధ్య నేడు కదలాడింది. ఏడాదిలో సిల్వర్ 41.3 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications