For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు, రూ.50,500 దిశగా పరుగు

|

బంగారం ధరలు పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌లో స్వల్పంగా పెరిగిన ధరలు నేడు (మే 17, మంగళవారం) కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. నిన్నటి వరకు రూ.50,000కు దిగువన ఉన్న గోల్డ్ ఫ్యూచర్, ఇప్పుడు రూ.50,000 పైకి చేరుకుంది. నేటి ఉదయం సెషన్‌‍లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.116 పెరిగి రూ.50,364 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.78 పెరిగి రూ.50,480 వద్ద ట్రేడ్ అయింది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో వెండి ధరలు కూడా పెరిగాయి. నేడు రూ.61,000ను క్రాస్ చేశాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.134 పెరిగి రూ.61,060 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.119 పెరిగి రూ.61,750 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6000 వరకు తక్కువగా ఉంది.

Gold prices regain RS 50000 level but silver rates drop

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1810 డాలర్ల దిగువ నుండి నేడు 1820 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వార్త రాసే సమయానికి 9 డాలర్లు లాభపడి 1822.94 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.061 డాలర్లు పెరిగి 21.617 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 250 డాలర్లకు పైగా తక్కువగా ఉంది గోల్డ్ ఫ్యూచర్స్.

English summary

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు, రూ.50,500 దిశగా పరుగు | Gold prices regain RS 50000 level but silver rates drop

On MCX, gold futures were up 0.17% to ₹50,331 per 10 gram while silver dropped 0.16% to ₹60831 per kg. In Monday's trade, gold rose 0.8% while silver jumped nearly 3%, supported by a pullback in US dollar.
Story first published: Tuesday, May 17, 2022, 10:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X