క్షీణించిన బంగారం ధరలు.. నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా; ధరలపై నిపుణులు చెప్తుందిదే!!
భారతదేశంలో బంగారు ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరోజు బంగారం ధరలు తగ్గితే రెండు రోజులు బంగారం ధరలు పెరగడం, మళ్లీ కాస్త బంగారం ధరలు తగ్గడం .. ఇలా బంగారం ధరల మధ్య ఊగిసలాట నిత్యకృత్యంగా మారింది. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపధ్యంలో బంగారం ధరలు పెరగటం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బంగారం ధరలు రానున్న అక్షయ తృతీయ నేపధ్యంలో బాగా పెరిగే అవకాశం ఉందని, బంగారం ధరలు 70 వేలకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు ఇప్పటికే చెప్తున్నారు.
ఇదిలా ఉంటే నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు, నేడు మళ్ళీ కాస్త తగ్గాయి. నిన్న దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,000 ఉంటే, నేడు 150 రూపాయలు తగ్గి 54,850 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న దేశంలో 60,000 గా ఉంటే నేడు 59,840 కొనసాగుతుంది. నిన్నటికి ఈరోజుకి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మీద 150 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద 160 రూపాయల మేర ధర తగ్గింది.

ఇక హైదరాబాద్లో బంగారం ధరల విషయానికొస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 54,850 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,840గా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54 వేల 950 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,990 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,850 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ముంబైలో 59,840గా ప్రస్తుతం కొనసాగుతుంది.
ఇక బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 54,900 ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,890 రూపాయలుగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,850గా ప్రస్తుతం విక్రయం అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,840 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. ఇక తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, వెల్లూరు, తురుచ్చి, తిరువూరు, తిరునవ్వేలి, ఈ రోడ్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,500గా కొనసాగుతుంటే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,550 గా కొనసాగుతుంది. దేశంలోనే తమిళనాడులో అత్యధికంగా బంగారం ధరలు ఉంటాయి.


Click it and Unblock the Notifications