మళ్ళీ తగ్గిన బంగారం ధరలు.. నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా; అక్కడ 60వేలకు పైనే!!
విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు అప్పుడప్పుడు కాస్త తగ్గుముఖం కూడా పడుతున్నాయి. తాజాగా బంగారం ధరలలో నేడు కాస్త తగ్గుదల నమోదయింది. బంగారం ధరలపై పసిడి ప్రియులలో ఆందోళన కొనసాగుతున్న వేళ మళ్లీ బంగారం ధరలు తగ్గడం కాస్త ఊరట ఇస్తుంది. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న బంగారం ధరల హెచ్చుతగ్గులు మరికొంత కాలం ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశంలో నేడు బంగారం ధర ఎంతగా తగ్గిందంటే
భారతదేశంలో బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,710 రూపాయల వద్ద నేడు ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,690 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మీద 140 రూపాయలు, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మీద 150 రూపాయల మేర ధర తగ్గింది.

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై లలో బంగారం ధరలు
ఇక హైదరాబాద్లో బంగారం ధర విషయానికి వస్తే నేడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,690 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 54,710 గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,900 ట్రేడ్ కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దేశాల రాజధాని ఢిల్లీలో 59,880 గా విక్రయించబడుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,710 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,690 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.
బెంగళూరు, కలకత్తా, ఏపీలో బంగారం ధరలు
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,800గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,780గా ప్రస్తుతం విక్రయించబడుతుంది. ఇక కలకత్తాలో బంగారం ధర విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,710 గా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కలకత్తాలో 59,690 రూపాయలుగా విక్రయించబడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, గుంటూరు, నెల్లూరులలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 54,710 రూపాయలుగా ప్రస్తుతం విక్రయించబడుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,690 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది.

తమిళనాడులో 60 వేలను దాటిన బంగారం ధరలు
దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,350 గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,400గా ప్రస్తుతం కొనసాగుతుంది. ఒక చెన్నైలో మాత్రమే కాకుండా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు, మధురై, సేలం, వేలూరు, తిరుచ్చి, ఈరోడ్, తిరువూరు, తిరునవ్వేలి లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,400 రూపాయలుగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,350 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. స్థానికంగా ఉండే పన్నులను బట్టి బంగారం ధరలలో కొద్దిపాటి మార్పులు ఉంటాయి అనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం.


Click it and Unblock the Notifications