పెరుగుతున్న బంగారం ధరలు, ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చా అంటే?

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న దాదాపు స్థిరంగా ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు అతి స్వల్పంగా పెరిగాయి. ఈ వారంలో బంగారం రూ.47,000 మార్కును క్రాస్ చేసింది. అంతకుముందు రూ.47,000 దిగువన ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ రూ.47,500 దిశగా కదులుతున్నాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (బుధవారం ఆగస్ట్ 18) ప్రారంభ సెషన్‌లో రూ.42.00 (0.09%) లాభపడి రూ.47322.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.66.00 (0.14%) ఎగిసి రూ.47500.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం రూ.63,000 దిగువకు వచ్చిన సిల్వర్ ఫ్యూచర్స్ ఈ వారం ఈ మార్కును క్రాస్ చేసింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.117.00 (0.19%) ఎగబాకి రూ.63343.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.129.00 (0.20%) ఎగిసి రూ.64080.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ 1800 డాలర్ల దిశగా సాగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్లో 3.05 (0.17%) డాలర్లు ఎగిసి 1,790.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గతవారం సిల్వర్ ఫ్యూచర్స్ 23 డాలర్ల దిగువకు వచ్చిన సిల్వర్ ఫ్యూచర్స్ ఇప్పుడు 24 డాలర్ల దిశగా సాగుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు 0.079 (0.33%) డాలర్లు లాభపడి 23.738 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గత ఏడాది ఆగస్ట్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.56200తో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఈ ఆల్ టైమ్ గరిష్టంతో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9000 తక్కువగా ఉంది.

Gold prices recover from 4 month lows but still down ₹9,000 from record highs

బంగారం ఇటీవల నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఇప్పుడు ఆ కనిష్టం నుండి కాస్త కోలుకుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ ఆందోళనను కలిగిస్తోంది. ఈ ప్రభావం బంగారం పైన ఒత్తిడిని పెంచుతోంది. దీంతో పసిడి ఇటీవల మళ్లీ పెరుగుతోంది.

బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పైపైకి చేరుకుంటున్న సమయంలో పెట్టుబడి పెట్టవచ్చా అంటే, దీర్ఘకాలంలో పెట్టుబడికి ఇబ్బంది లేదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.9000, అంతర్జాతీయంగా 2075 ఆల్ టైమ్ గరిష్టం నుండి దాదాపు 300 డాలర్ల తక్కువగా ఉంది. ప్రస్తుతం పసిడి కాస్త పైకి చేరుతున్నప్పటికీ, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మాత్రం కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ప్రస్తుత పరిస్థితుల్లో విక్రయించి, మళ్లీ పడిపోయినప్పుడు కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు. అయితే బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్, డాలర్ వ్యాల్యూ, కరోనా వంటి విపత్తుల పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి మార్కెట్ పరిస్థితులు తెలుసుకొని ముందుకు సాగాలి.

అంతర్జాతీయ ఎకానమీ రికవరీ పుంజుకుంటోందని, గ్రీన్ బ్యాంక్ వచ్చే ఏడాదికి మరింత బలపడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం పెట్టుబడిపై లేదా బులియన్ హోల్డింగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలనీ నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా జాబ్ డేటా అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసిందని చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు కూడా ఎకానమీకి అనుకూలంగా కొనసాగుతున్నాయని చెబుతున్నారు. డాలర్ క్రమంగా బలపడుతోందని, కాబట్టి బులియన్ హోల్డింగ్స్ పట్ల ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+