For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices: భారీ తగ్గుదల... ఒక్కరోజే బంగారం రూ.852, వెండి రూ.2,500 డౌన్

|

న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు రెండు మూడు రోజులు పెరిగి, 10 గ్రాములు రూ.51 వేల మార్క్ దాటిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఫ్యూచర్ మార్కెట్ క్లోజింగ్ సమయానికి భారీగా క్షీణించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్ గోల్డ్ ధర రూ.852(1.67శాతం) క్షీణించి రూ.50,255 పలికింది. ఆగస్ట్ 7న రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ ధరతో పోలిస్తే ఆరువేల రూపాయలు తక్కువగా ఉంది.

రూ.850 తగ్గిన బంగారం ధర

రూ.850 తగ్గిన బంగారం ధర

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం రూ.50,870 ప్రారంభమై, రూ.51,078 వద్ద గరిష్టాన్ని తాకింది. కనిష్టం రూ.50,110 పలికి చివరకు రూ.50255 వద్ద ముగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ కూడా రూ.874 తగ్గింది. రూ.51,167 వద్ద ప్రారంభమై, గరిష్టం రూ.51,167ను తాకి, కనిష్టం రూ.50,300ను తాకింది. చివరకు రూ.50,367 వద్ద ముగిసింది. దాదాపు రెండు రోజుల పాటు ఎంత మేరకు పెరిగిందో నిన్న ఒకేరోజు అంత క్షీణించింది. పండుగ సీజన్ సమయంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ధర తగ్గడం ఇటు కొనుగోలుదారులతో పాటు వ్యాపారం కొంత పెరుగుతుందని రిటైల్ అమ్మకందారులు కూడా ఆశతో ఉన్నారు.

వెండి ధ రూ.2568 డౌన్

వెండి ధ రూ.2568 డౌన్

వెండి ధర కూడా భారీగానే తగ్గింది. ఒకేరోజు రూ.2,500కు పైగా క్షీణించింది. ఎంసీఎక్స్‌లో కిలో వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.2,568.00 (4.07%) తగ్గి రూ.60,530 వద్ద క్లోజ్ అయింది. రూ.62,401 వద్ద ప్రారంభమై, రూ.62,978 వద్ద గరిష్టాన్ని, రూ.60,200 వద్ద కనిష్టాన్ని తాకి రూ.60,530 వద్ద ముగిసింది.

వెండి మార్చి ఫ్యూచర్ ఏకంగా రూ.2,903.00 (4.45%) క్షీణించి రూ.62,338 వద్ద క్లోజ్ అయింది. మంగళవారం రూ.64,101 ప్రారంభమై, రూ.64,967 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.62,040 వద్ద కనిష్టాన్ని తాకి రూ.62,338 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం డిసెంబర్ ఫ్యూచర్స్ 3.25 శాతం క్షీణించి 1,891.25 డాలర్లు పలికింది. 1,886.05 - 1,897.15 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు రోజు 1,894.60 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.29 శాతం క్షీణించి ఔన్స్ 24.047 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది.

English summary

Gold prices: భారీ తగ్గుదల... ఒక్కరోజే బంగారం రూ.852, వెండి రూ.2,500 డౌన్ | Gold prices plunge Rs 852, silver rates crash ₹2,500 in a day

Tracking softer global rates, gold and silver prices today fell sharply in Indian markets. On MCX, December gold futures were down 1.5% at ₹50,310 per 10 gram in their first decline in three days while silver futures plunged 4% or ₹2,500 to ₹60641 per kg.
Story first published: Wednesday, October 14, 2020, 7:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X